ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

5G Smart Phones: జూలై మొదటి వారంలో మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్లు..వీటి ధర ఎంతంటే..

ABN, First Publish Date - 2023-07-03T18:43:39+05:30

జూలై మొదటి వారంలో ఇండియన్ మార్కెట్లోకి పలు రకాల 5జీ ఫోన్లు అందుబాటులో రానున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 34, ఒన్2ప్లస్ నార్డ్3, రియల్మీ నార్జో 60 Seriesలు అందుబాటు ధరల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఆయా కంపెనీలు వివిధ రకాల 5జీ ఫోన్లను ఈ వారంలో రిలీజ్ చేయనున్నాయి. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధరలు గురించి తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలై మొదటి వారంలో ఇండియన్ మార్కెట్లోకి పలు రకాల 5జీ ఫోన్లు అందుబాటులో రానున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 34(Samsung Galaxy M34), ఒన్2ప్లస్ నార్డ్3(OnePlus Nord 3), రియల్మీ నార్జో 60(Realme Narzo 60) Seriesలు అందుబాటు ధరల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఆయా కంపెనీలు వివిధ రకాల 5జీ ఫోన్లను ఈ వారంలో రిలీజ్ చేయనున్నాయి. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధరలు గురించి తెలుసుకుందాం.

శామ్‌సంగ్ గెలాక్సీ M34(Samsung Galaxy M34):

జూలై7న శామ్‌సంగ్(Samsung) కంపెనీ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్2ను రిలీజ్ చేయనుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M34 5జీ పేరుతో ఇది మార్కెట్లోకి రానుంది. ఈ Galaxy M సిరీస్ 5G ఫోన్‌‌లో 120Hz డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటాయి. వీడియో క్వాలిటీ మరింత పెంచేలా ప్రధాన కెమెరాలో సెన్సార్ OIS సపోర్ట్ ఉంటుంది. ఈ సిరీస్‌కు సంబందించి ఫీచర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే 6.6 అంగుళాల FHD+ సూపర్ AMOLED స్క్రీన్‌తో Samsung Galaxy M34 5G అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌ ఉంటుంది. Samsung Galaxy M34 5G ధర రూ.20వేల లోపు ఉంటుందని అంచనా.

Oneplus Nord3 స్మార్ట్‌ఫోన్

మార్కెట్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న Oneplus జూలై 4న సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల పొడవు, 1.5కె రెజెల్యూషన్, 120Hz డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. ఇది నార్డ్ సిరీస్ ఫోన్ మాదిరిగానే ఎమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. వెనకవైపున ట్రిపుల్ కెమెరా సెటప్‌తోపాటు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాలో 8 మెగా పిక్సల్ సెన్సార్, 2 మెగాపిక్సల్ కెమెరాతో కలిసి ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, రిటైల్ ప్యాక్‌లో ఛార్జర్ కూడా ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.30వేలు. అలాగే కంపెనీ OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఇది 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, 6.7అంగుళాల FHD+ AMOLED,50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చని తెలుస్తోంది.

Realme Narzo 60 series

చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Realme మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇండియాలో రిలీజ్ చేయనుంది. జూలై 6న Realme Narzo 60 Series 5జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ Seriesలో రెండు మోడళ్లు ఉంటాయి. ఒకటి Realme Narzo 60 5జీకాగా.. రెండోది Realme Narzo 60 ప్రో 5జీ. Realme Narzo 60 series 5జీ ఫోన్లు అద్బుతమైన ఫీచర్లు కలిగి వున్నాయి. Realme Narzo 60 Pro స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన లగ్జరీ వెగాన్ టెక్షర్ డిజైన్‌, 61 డిగ్రీల కర్డ్వ్ డిస్‌ప్లే, సెంటర్ పంచ్ హోల్‌తో ఫ్రంట్‌‌కెమెరా వంటి ఫీచర్లు ఈ సిరీస్ ఉన్నాయి. మార్టియన్ హరిజోన్ డిజైన్‌, రియల్మీ 11 ప్రో(Realme 11Pro) మాదిరిగా Realme Narzo 60 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా వెనకవైపు ఆరెంజ్ కలర్‌తోపాటు 100 మెగా పిక్సెల్ కెమెరా, సుమారు 2.50 లక్షల ఫొటోలను స్టోర్ చేసుకనే స్టేరేజ్ అవకాశం ఉంటుంది.

Updated Date - 2023-07-03T18:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising