ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rs 2000 notes: 97.26 శాతం నోట్లు వెనక్కి: ఆర్బీఐ

ABN, First Publish Date - 2023-12-01T14:14:20+05:30

రూ.2,000 నోట్లు 97.26 శాతం బ్యాంకుల్లో జమ అయినట్టు రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది 19 వరకూ సర్క్యులేషన్‌లో ఉన్న నోట్ల లీగల్ టెండర్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. 2.7 శాతం బ్యాంకునోట్లు ఇంకా సర్క్యులేషన్‌లో ఉన్నట్టు పేర్కొంది.

న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు (Rs.2000 notes) 97.26 శాతం బ్యాంకుల్లో జమ అయినట్టు రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ ఏడాది 19 వరకూ సర్క్యులేషన్‌లో ఉన్న నోట్ల లీగల్ టెండర్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. 2.7 శాతం బ్యాంకునోట్లు ఇంకా సర్క్యులేషన్‌లో ఉన్నట్టు పేర్కొంది. బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు గత అక్టోబర్ 7వ తేదీతో ముగిసింది. దాని తరువాత రూ.2,000 నోట్ల చలామణికి బ్రేక్ పడింది.

''ఈ ఏడాది మే 19 వరకూ రూ.3.56 లక్షల కోట్లు విలువచేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. నవంబర్ 30 నాటికి ఇది రూ.9,760 కోట్లుగా ఉంది'' అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులలో రూ.2,000 నోట్లను డిపాజిట్, ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కొనసాగుతున్నట్టు తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఈ 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులున్నాయి.

Updated Date - 2023-12-01T14:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising