Adani: మరో న్యూస్ ఏజెన్సీలో వాటా కొనేసిన అదానీ గ్రూప్.. ఐఏఎన్ఎస్లో ఏకంగా 50 శాతం వాటా అదానీ పరం!
ABN, Publish Date - Dec 16 , 2023 | 08:02 PM
గత కొంత కాలంగా మీడియా హౌస్‌లపై కన్నేసిన అదానీ గ్రూప్ తాజాగా మరో న్యూస్ ఏజెన్సీని చేజిక్కించుకుంది. గతేడాది ఎన్డీటీవీని, అంతకు ముందే బిజినెస్, ఫైనాన్సియల్ డిజిటల్ మీడియా ``బీక్యూ ప్రైమ్``ను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ తాజాగా ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాను కొనేసింది.
గత కొంత కాలంగా మీడియా (Media) హౌస్‌లపై కన్నేసిన అదానీ గ్రూప్ (Adani Group) తాజాగా మరో న్యూస్ ఏజెన్సీని చేజిక్కించుకుంది. గతేడాది ఎన్డీటీవీని (NDTV), అంతకు ముందే బిజినెస్, ఫైనాన్సియల్ డిజిటల్ మీడియా ``బీక్యూ ప్రైమ్``ను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ తాజాగా ఐఏఎన్ఎస్ (ఇండో- ఆసియా న్యూస్ సర్వీస్) ఇండియాలో మెజారిటీ వాటాను కొనేసింది. ఐఏఎన్ఎస్ (IANS) ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.5శాతం వాటాను చేజిక్కించుకోవడంతో ఈక్విటీ షేర్లు, ఓటింగ్ రైట్స్ వంటివి అదానీ గ్రూప్ చేతికి వచ్చాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ సబ్సిడరీ అయిన ఏఎమ్‌జీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ ఈ డీల్‌ను పూర్తి చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 11.86కోట్లుగా నమోదైంది. తాజా డీల్‌తో ఐఏఎన్ఎస్కు సంబంధించిన పూర్తి నియంత్రణ అదానీ గ్రూప్ చేతిలోకి వచ్చింది. మొత్తం బోర్డ్ డైరెక్టర్లందరినీ నియమించే అధికారం అదానీ గ్రూప్‌నకే ఉంటుంది. గతేడాది ఎన్డీటీవీని కూడా అదానీ గ్రూప్ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీటీవీ ప్రొమోటర్, ఫౌండర్స్ ప్రణయ్ రాయ్, రాధిక రాయ్‌లకు చెందిన 27.26శాతం వాటాని అదానీ రూ. 602 కోట్లకు కొనుగోలు చేశారు.
Updated Date - Dec 16 , 2023 | 08:02 PM