ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BGAUSS: మార్కెట్లోకి బిజి సి12 విద్యుత్ స్కూటర్ విడుదల.. రూ. 999తో బుకింగ్ ప్రారంభం

ABN, First Publish Date - 2023-04-09T16:47:15+05:30

బిగాస్ (BGAUSS) తన ప్రతిష్ఠాత్మక విద్యుత్ స్కూటర్ ‘బిజి సి12’ (BG C12)ను మార్కెట్లోకి విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: బిగాస్ (BGAUSS) తన ప్రతిష్ఠాత్మక విద్యుత్ స్కూటర్ ‘బిజి సి12’ (BG C12)ను మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యంత ఆకర్షణీయంగా, శక్తిమంతంగా ఉన్న ఈ స్కూటర్‌ను అందరికీ అందుబాటు ధరల్లో తీసుకొచ్చింది. పూర్తి మేడిన్ ఇండియా స్కూటరైన ఇందులో 20కిపైగా భద్రతా ఫీచర్లు ఉండడం విశేషం.

బిజి సి12 స్కూటర్ విడుదల సందర్భంగా బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కాబ్రా మాట్లాడుతూ.. విద్యుత్ స్కూటర్ పరిశ్రమలోనే తొలిసారిగా ‘సి12’లో అద్భుతమైన ఫీచర్ అయిన బూట్ స్పేస్‌ ఇందులో ఉన్నట్టు చెప్పారు. హెల్మెట్‌ను కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చన్నారు. పొడవాటి సీటు కుటుంబానికి అత్యంత అనువుగా, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు. వాటర్ ప్రూఫ్ ఐపీ 67 రేటెడ్ విద్యుత్ మోటార్, బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్‌లో 3.2 కిలోవాట్ అవర్-క్యాన్ ఎనేబుల్డ్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించినట్టు వివరించారు.

బిగాస్‌కు దేశవ్యాప్తంగా 100కుపైగా షోరూములు ఉన్నాయి. డీలర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు బిగాస్ ప్రణాళికలు రచిస్తోంది. స్మార్ట్‌, సురక్షిత, తెలివైన విద్యుత్‌ స్కూటర్లను అందించడానికి బిగాస్ కట్టుబడి ఉన్నట్టు హేమంత్ తెలిపారు. వార్షిక నిర్వహణ, మొబైల్‌ యాప్‌ మద్దతు, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ వంటివి సైతం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, బిజి సి12 పరిచయ ధర రూ. 97,999 కాగా రూ. 999తో స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Updated Date - 2023-04-09T16:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising