Buying Flat: ఫ్లాట్‌ను కొనే ఆలోచనలో ఉన్నారా..? ఈ టిప్స్‌ను ఫాలో అయితే డబ్బుల ఖర్చు తగ్గడం గ్యారెంటీ..!
ABN, First Publish Date - 2023-09-29T13:16:04+05:30
చాలామంది ఇళ్లను కొనుగోలు చేసే విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆర్థిక భారాన్ని పెంచుతుంటాయి. ఈ కింద చెప్పుకునే టిప్స్ ను ఫాలో అయితే ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు బోలెడు డబ్బు ఆదా అవుతుంది.
సొంతిల్లు ఎంతోమంది కల. ప్రతి వ్యక్తి జీవితంలో అత్యధిక ఖర్చు చేసే విషయం ఏదైనా ఉందంటే అది ఇల్లు కొనుగోలుకే. పట్టణాలు నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ కావాలని అనుకునేవారు చాలావరకు ఫ్లాట్ కొనుగోలు చేయడం మీద ఆసక్తి కలిగి ఉంటారు. అయితే ఇవి లక్షలాది రూపాయలతో కూడిన వ్యవహారాలు. చాలామంది ఇళ్లను కొనుగోలు చేసే విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆర్థిక భారాన్ని పెంచుతుంటాయి. ఈ కింద చెప్పుకునే టిప్స్ ను ఫాలో అయితే ఇళ్లు కొనుగోలు చేసేటప్పుడు బోలెడు డబ్బు ఆదా అవుతుంది. అవేంటో తెలుసుకుంటే..
ఇల్లు కొనాలనుకునే ఆలోచన ఉన్నవారు మొదట చేసే పని బ్రోకర్లు లేదా ఏజెంట్ల సహాయం తీసుకోవడం. ఏజెంట్ ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తే ఒకటి నుండి ఒకటిన్నర శాతం డబ్బు కమీషన్ గా తీసుకుంటాడు. మరొక విషయం ఏమిటంటే ఏజెంట్ కేవలం కొనుగోలు దారుల దగ్గరే కాదు డవలపర్ దగ్గర కూడా కమీషన్ వసూలు చేస్తాడు. ఇక డవలపర్ ఆ నష్టం భర్తీ చేసుకోవడాని ఆ భారాన్ని కొనుగోలు దారులమీదే వేస్తాడు. ఈ విధంగా చూస్తే కొనుగోలు దారులు 2.5నుండి 3 శాతం వరకు డబ్బు కోల్పోతారు. లక్షలమీద జరిగే వ్యవహారాలలో 3శాతం అన్నా చాలా ఎక్కువ మొత్తమే. కాబట్టి నేరుగా డవలపర్ ను సంప్రదించి ఇల్లు కొనుగోలు చేయాలి.
2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్లను తీసుకుంటారా..? ఎక్కడెక్కడ తీసుకునే ఛాన్స్ ఉందంటే..!
అమ్మకందారులతో నేరుగా చర్చలు జరపడం వల్ల సుమారు ఐదు శాతం డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇక ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డబ్బు మొత్తం ఒకేసారి కట్టేందుకు సిద్దంగా ఉంటే కాస్త తక్కువకే ఇంటిని అమ్ముతారు. దీని వల్ల గరిష్టంగా డబ్బు ఆదా అవుతుంది. ఇక ఇల్లు కొనాలనే ఆలోచన ఉన్న ఇద్దరు ముగ్గురు కలిసి అమ్మకం దారులతో మాట్లాడితే చాలావరకు తగ్గింపు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఇల్లు కొనుగోలు చెయ్యాలని అనుకున్న ప్రాంతంలో ఆస్తులు, స్థలాల రేట్లు ఎలా ఉన్నాయనే విషయం గురించి బాగా విచారించిన తరువాతే అమ్మకం దారులను సంప్రదించాలి. ఇలా చేస్తే సరైన ధరకు ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఇక అల్రెడీ కట్టిన ఇళ్ళ కంటే ఇంకా నిర్మాణంలో ఉన్నవాటిని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవడం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా పెద్ద పండుగల సమయంలో వార్షికోత్సవాల సమయంలోనూ అమ్మకం దారులు డిస్కౌంట్ ఇస్తుంటారు. ఆ సమయంలో కొనుగోలు చేయడం మంచిది. స్థానికంగా నివసిస్తున్న ప్రాంతంలోనే ఇల్లు కొనాలనుకుంటే స్నేహితులు, ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకుంటే ఆస్తి ధరలు ఖచ్చితంగా తెలుస్తాయి.
Elephant Video: బండి ఎక్కి వెళ్లిపోతున్న మావటి.. ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చి మరీ ఏం చేసిందంటే..!
Updated Date - 2023-09-29T13:16:04+05:30 IST