ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vodafone-Idea: వీఐను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? క్లారిటీ ఇదే..!!

ABN, First Publish Date - 2023-12-13T19:43:07+05:30

Vodafone-Idea: తీవ్ర నష్టాల్లో ఉన్న వొడాఫోన్-ఐడియా సంస్థను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. వీఐ సంస్థను కొనుగోలు చేసే ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

టెలీకాం రంగంలో కొంతకాలం క్రితం వొడాఫోన్, ఐడియా విలీనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు సంస్థలు విలీనమైన తర్వాత వీఐగా తమ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అయితే జియో రాకతో మిగతా టెలీకాం సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఎయిర్ టెల్‌తో పోలిస్తే వొడాఫోన్-ఐడియా సంస్థ ఎక్కువ నష్టాల్లో ఉందని మార్గెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వొడాఫోన్-ఐడియా సంస్థను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. వీఐ సంస్థను కొనుగోలు చేసే ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెలీకాం విభాగం వాయిదా వేసిన సర్దుబాటు చేసిన ఏజీఆర్ బకాయిలపై చెల్లించాల్సిన వడ్డీ రూ.16,133 కోట్లకు బదులు 33.1 శాతం వాటాను వీఐ సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో వీఐలో అతిపెద్ద వాటాదారుగా కేంద్ర ప్రభుత్వం నిలిచింది. అయితే వీఐ సంస్థకు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వాటాను తీసుకుందని.. ఈక్విటీ, డెట్ ద్వారా నిధులను సేకరించేందుకు ఇబ్బంది పడుతున్న కంపెనీని కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీంతో మొత్తం కంపెనీని కేంద్రం టేకోవర్ చేసుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం కాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు స్టాక్ మార్కెట్‌లో వొడాఫోన్-ఐడియా షేర్ ధరలు కొన్నిరోజులుగా పడుతూ లేస్తున్నాయి. ఈరోజు వీఐ సంస్థ షేర్ ధర రూ.13.18గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే 0.38 శాతం షేర్ ధర పెరిగింది.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-13T19:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising