ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ICICI-Videocon loan case: ముంబయి జైలు నుంచి చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ విడుదల

ABN, First Publish Date - 2023-01-10T12:26:45+05:30

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ రుణం పేరిట మోసం కేసులో ముంబై జైలు నుంచి...

Chanda Kochhar, Deepak Kochhar Released
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ రుణం పేరిట మోసం కేసులో ముంబై జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు.(Released from Mumbai Jail)బైకుల్లా మహిళా జైలు నుంచి చందా కొచ్చర్ మంగళవారం బయటకు వచ్చారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి దీపక్ కొచ్చర్ కూడా విడుదలయ్యారు.(Chanda Kochhar, Deepak Kochhar)ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్‌పై విడుదల చేసింది.

వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలు అందించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై(Loan Fraud Case) సీబీఐ తమను అరెస్టు చేయడం చట్టవిరుద్ధం అని వారు పేర్కొన్నారు. వారం రోజుల పాటు సీబీఐ రిమాండ్‌లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణాల కేసులో కొచ్చర్‌లను డిసెంబర్ 25వతేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నెలలో తమ కుమారుడి వివాహం జరగనున్న నేపథ్యంలో కొచ్చర్లు బెయిలు కోరగా కోర్టు మంజూరు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్ జైలు నుంచి విడుదలైన తర్వాత వారి కుమారుడిని కౌగిలించుకున్నారు.

Updated Date - 2023-01-10T12:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising