ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ePluto 7G Max EV: ఆకట్టుకునే రంగుల్లో మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ABN, First Publish Date - 2023-10-06T18:24:51+05:30

ప్యూర్ EV- 201 KM రేంజ్‌లో ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివ‌ర్స్ మోడ్ కూడా క‌లిగిన స్కూట‌ర్‌గా దీని ప్రత్యేక‌త‌లెన్నో ఉన్నాయని సంస్థ వెల్లడించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్యూర్ EV- 201 KM రేంజ్‌లో ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివ‌ర్స్ మోడ్ కూడా క‌లిగిన స్కూట‌ర్‌గా దీని ప్రత్యేక‌త‌లెన్నో.. ఉన్నాయని సంస్థ వెల్లడించింది. ప్యూర్ EV ePluto 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు.. ఎలక్ట్రిక్ మోటార్‌ను కనెక్ట్ చేయ‌టంతో ఎంతో స్పెష‌ల్ రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా మ‌రెన్నో స్పెష‌ల్ ఫీచర్లు కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ .. మొత్తం నాలుగు రంగుల్లో ల‌భ్యమ‌వుతోన్న ప్యూర్ EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సదరు కంపెనీ భారతీయ మార్కెట్లోకి విడుద‌ల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధ‌ర‌.. కేవ‌లం రూ. 1, 14, 999. ఈ స్కూటర్ బుకింగ్.. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభ‌మైంది. ప్లూటో వాహ‌నాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ పండుగ సీజన్ నుంచి డెలివ‌రీ ఇవ్వనున్నారు. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీట‌ర్ల నాన్ స్టాప్‌గా ప‌రుగులు తీయనుంది. అంతేకాకుండా ఈ EVలో ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన‌ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్‌ను సైతం క‌లిగి ఉంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి స‌దుపాయాలుండ‌టం మ‌రో ప్రత్యేక ఆక‌ర్షణ‌.


ఇది కూడా చదవండి: RBI Repo rate: వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం

ఈ స్కూట‌ర్‌కు క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు 3.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అనుసంధానం చేయడం వల్ల ఇది 3.21 bhp మేర‌.. అత్యధిక‌ శక్తి అందిస్తుంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన స్మార్ట్ బ్యాటరీ దీని సామ‌ర్ధ్యాన్ని మ‌రింత మెరుగు ప‌రుస్తోందని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్‌ను మరింత మెరుగుపరచడానికి, మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు క‌లిగి ఉన్నాయ‌ని అంటున్నారు. దీంతో పాటు ఈ EV స్కూటర్ 60 వేల‌ కిలోమీటర్ల వారెంట్‌తో వస్తోంది. దీంతో పాటు 70 వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ప్రతినిధులు అన్నారు. సో బైక్ ల‌వ‌ర్స్.. గోటు రైడ్.. గెట్ ద ప్రైడ్.. ఓన్ ద మ్యాక్స్.. గెయిన్ ద మ్యాగ్జిమం ఎక్స్ పీరియ‌న్స్.. అన్నది వీరి స్లోగ‌న్‌గా క‌నిపిస్తోంది.

Updated Date - 2023-10-06T18:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising