ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Business Ideas: టెర్రస్‌పై ఈ బిజినెస్ చేసేయండి.. ఈజీగా డబ్బులు సంపాదించండి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:36 PM

ఉద్యోగాలతో పాటు బిజినెస్ చేసే సంస్కృతి ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది. ఏ బిజినెస్‌‌కైనా రిస్క్ తప్పనిసరి. అయితే చాలా మంది పెట్టుబడికి ఆర్థిక స్థోమత సరిపోక వెనకడుగేస్తుంటారు. అలాంటప్పుడు కొంచెం ఆలోచిస్తే ఇంట్లోనే బిజినెస్ చేసే స్థాయికి ఎదిగి అవకాశం ఉంది. అదీ టెర్రాస్‌పై.

ఢిల్లీ : ఉద్యోగాలతో పాటు బిజినెస్ చేసే సంస్కృతి ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది. ఏ బిజినెస్‌‌కైనా రిస్క్ తప్పనిసరి. అయితే చాలా మంది పెట్టుబడికి ఆర్థిక స్థోమత సరిపోక వెనకడుగేస్తుంటారు. అలాంటప్పుడు కొంచెం ఆలోచిస్తే ఇంట్లోనే బిజినెస్ చేసే స్థాయికి ఎదిగి అవకాశం ఉంది. అదీ టెర్రాస్‌పై. ఎలాగనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియాలు(Business Ideas) చదవండి మరి..

మిద్దె వ్యవసాయం..

టెర్రాస్ ఫార్మింగ్(Terras Farming) గురించి తెలియని వారు ఉంటారా చెప్పండి. మట్టితో నింపే కుండలు, సంచులను ఉపయోగించి మిద్దెపై పూలు, కూరగాయాలు పెంచుకోవచ్చు. ఇది మిద్దె వ్యవసాయంగా ప్రాచుర్యం పొందింది. ఇంటిపై చాలానే స్థలం అందుబాటులో ఉంటే టమాటా, ముల్లంగి, బీన్స్, వంకాయలు తదితర కూరగాయల్ని పండించవచ్చు.

టవర్ అద్దె...

పట్టణాలు, నగరాల్లో చాలా వరకు ఇళ్లపై టవర్లు కనిపిస్తుంటాయి. టెర్రాస్ బిజినెస్ ఐడియాల్లో ఇదీ ఒకటి. మొబైల్ టవర్లు ఉంచడానికి సదరు కంపెనీలకు టెర్రాస్ స్థలాన్ని అద్దెకు ఇవ్వచ్చు. దానికోసం ముందు లోకల్ అధికారుల నుంచి పర్మిషన్లు పొందాలి. పర్మిషన్ మంజూరయ్యాక మొబైల్ కంపెనీలు మిద్దెను ఉపయోగించుకున్నందుకు నెల నెలా రెంట్ చెల్లిస్తాయి. నగరాల్లో ఈ బిజినెస్ ద్వారా సుమారు నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చు. పట్టణాల్లో రెంట్ కొంచం తక్కువగా ఉంటుంది.


సోలార్ ప్యానెళ్లు...

మిద్దెపై ఖాళీ స్థలం ఉంటే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. సోలార్ ప్యానెళ్లు(Solar Panels) అమర్చుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. తద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇంటికి వాడుకోవచ్చు. లేదా గ్రిడ్ ద్వారా ప్రభుత్వానికి ఇతర కంపెనీలకు మిగులు విద్యుత్తును అమ్ముతూ.. నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించొచ్చు.

హోర్డింగ్స్‌ లేదా బ్యానర్లు

మన ఇల్లు రద్దీ ప్రాంతంలో ఉంటే, టెర్రస్‌పై హోర్డింగ్‌లు లేదా బ్యానర్లు పెట్టి డబ్బు సంపాదించవచ్చు. వివిధ ఉత్పత్తులు ప్రకటనలను టెర్రస్‌పై ప్రదర్శించడానికి అనుమతించవచ్చు. అయితే వీటి ధర లొకేషన్‌ బట్టి మారుతూ ఉంటుంది. మంచి డీల్స్‌ కోసం యాడ్ ఏజెన్సీలతో కలిసి పని చేయొచ్చు.

ఇంకా ఎన్నో...

టెర్రాస్ పై పైన చెప్పిన బిజినెస్ ఐడియాలతోపాటు రూఫ్‌టాప్ రెస్టారెంట్ లేదా కేఫ్ స్టార్ట్ చేయొచ్చు. యోగా / ఫిట్‌నెస్ క్లాసులు చెప్పుకోవడానికి ఇతరులకు రెంట్‌కి ఇవ్వొచ్చు. అవుట్‌డోర్ థియేటర్ ఏర్పాటు చేసి.. ఒక్కొక్కరి చొప్పున ఫీ తీసుకోవచ్చు.

Updated Date - Dec 28 , 2023 | 12:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising