ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union budget 2023:లోక్‌సభ టీవీలో కేంద్రబడ్జెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు...

ABN, First Publish Date - 2023-02-01T08:07:16+05:30

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ 2023 ను ప్రవేశపెట్టనున్నారు....

Finance Minister Nirmala Sitharaman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ 2023 ను ప్రవేశపెట్టనున్నారు.(Finance Minister Nirmala Sitharaman)దేశ ప్రజలు ఫిబ్రవరి 1వతేదీన బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ టీవీలో కేంద్ర బడ్జెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.(Present Budget Today) ప్రజలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితోపాటు యూట్యూబ్ (YouTube),ట్విట్టర్ (Twitter) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా బడ్జెట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు.వీక్షకులు ఇండియా బడ్జెట్ (www.indiabudget.gov.in)లో సెషన్‌ను కూడా చూడవచ్చు.

నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాలు...

గత సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 92 నిమిషాల పాటు తన బడ్జెట్(Union budget) ప్రసంగం చేశారు. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ చేసిన అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాలకు ప్రసిద్ధి చెందిన సీతారామన్ 2019లో 2 గంటల 15 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది భారతదేశ చరిత్రలో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం. 2020వసంవత్సరంలో కేంద్రమంత్రి 162 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ ఐదవ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్(Union budget 2023) కానుంది.

పేపర్‌లెస్ బడ్జెట్

గత రెండు బడ్జెట్‌ల మాదిరిగానే ఈ ఏడాది బడ్జెట్‌ను పేపర్‌లెస్ రూపంలోనే ప్రవేశపెట్టనున్నారు.మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఆదాయపు పన్ను స్లాబ్‌లను సర్దుబాటు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి.2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తి బడ్జెట్ కావడంతో ఈ ఏడాది బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది.బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమకు కొత్త రైళ్లు ఇవ్వాలని, జీఎస్టీ, పన్ను బకాయిలు విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కోరారు. జగదల్‌పూర్, సుర్గుజా ప్రాంతాల్లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని సీఎం బఘేల్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-01T08:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising