Confirmtkt: కన్ఫర్మ్‌టికెట్ తొలి బ్రాండ్ అంబాసీడర్‌గా రానా దగ్గుబాటి.. ‘ట్రైన్ టికెట్ టైగర్’ క్యాంపెయిన్ షురూ
ABN, First Publish Date - 2023-01-05T20:39:28+05:30
ఇక్సిగో గ్రూప్ యాప్‌నకు చెందిన ట్రైన్ టికెట్ డిస్కవరీ, బుకింగ్ ప్లాట్‌ఫామ్ కన్ఫర్మ్‌టికెట్ (confirmtkt) తన తొలి బ్రాండ్ క్యాంపెయిన్ ‘ట్రైన్ టికెట్ టైగర్’ కోసం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటిని (Rana Daggubati) రంగంలోకి దింపింది.
హైదరాబాద్, 5 జనవరి 2023: ఇక్సిగో గ్రూప్ యాప్‌నకు చెందిన ట్రైన్ టికెట్ డిస్కవరీ, బుకింగ్ ప్లాట్‌ఫామ్ కన్ఫర్మ్‌టికెట్ (confirmtkt) తన తొలి బ్రాండ్ క్యాంపెయిన్ ‘ట్రైన్ టికెట్ టైగర్’ కోసం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటిని (Rana Daggubati) రంగంలోకి దింపింది. యూజర్లకు తిరుగులేని ప్రయాణ అనుభూతిని అందించే విధంగా విస్తృత శ్రేణి ఫీచర్లకు ప్రాచుర్యం కల్పించేలా ఈ ప్రచారాన్ని డిజైన్ చేశారు. టీవీ, రేడియో, డిజిటల్ వేదికలపై ఈ క్యాంపెయిన్ ప్రారంభమవనుంది.
కన్ఫర్మ్ టికెట్‌ని 'ట్రైన్ టికెట్ టైగర్' (Train Ticket Tiger) ప్రమోషన్‌లో భాగంగా రానా దగ్గుబాటి కొత్త అవతారంలో కనిపించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘‘ఈ క్యాంపెయిన్ కోసం కన్ఫర్మ్ టికెట్‌తో జట్టుకట్టడానికి సంతోషిస్తున్నాను. ఈ బ్రాండ్‌ను తెలుగు వ్యవస్థాపకులు ప్రారంభించినందున ఈ అనుబంధం ప్రత్యేకమైనది. ఇప్పుడు ఇది భారతదేశంలోని ప్రముఖ ట్రైన్ బుకింగ్ యాప్‌లలో ఒకటిగా ఉంది. తెలుగువారందరికీ ఇది గర్వకారణం. కన్ఫర్మ్ టికెట్ మార్కెట్‌లో ఒక ముఖ్యమైన సంస్థగా ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు దీనిని ఉపయోగిస్తున్నారు. కంపెనీ అందించిన వినయ పూర్వక ప్రారంభం, అసాధారణ వృద్ధి ప్రయాణానికి నేను ప్రతిరూపంగా ఉన్నాను’’ అని వ్యాఖ్యానించారు.
కన్ఫర్మ్ టికెట్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ దినేశ్ కొత్త, కన్ఫర్మ్ టికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ శ్రీపద్ వైద్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, ”మా బ్రాండ్ ప్రచారం కోసం డైనమిక్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటితో మా అనుబంధాన్ని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. ట్రైన్ ప్రయాణికులకు వారి ప్రయాణాన్ని వీలైనంతగా సాటి లేనిదిగా చేయడానికి మేం అందించే ప్రత్యేక ఫీచర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రచారం తో మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-01-05T20:39:30+05:30 IST