Gold Prices Today: బంగారం ధర పెరిగిందిగా.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..
ABN, First Publish Date - 2023-03-03T07:52:56+05:30
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు (Today Gold Rates) శుక్రవారం (మార్చి 3,2023) స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోల్చుకుంటే..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు (Today Gold Rates) శుక్రవారం (మార్చి 3,2023) స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం 150 రూపాయలు పెరిగింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం నాడు 51,600 రూపాయలు ఉండగా, శుక్రవారం ఈ ధర రూ.51,750కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రోజు 56,290 రూపాయలు ఉండగా, శుక్రవారం నాడు 56,450 రూపాయలకు పెరిగింది. 24 గ్రాముల బంగారం 10 గ్రాములపై 160 రూపాయలు పెరగడం గమనార్హం. గత పదిరోజుల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. ఫిబ్రవరి 21న 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 పలకగా, మార్చి 3 నాటికి 51,750 రూపాయలకు తగ్గింది.
ఇక.. 24 క్యారెట్ల బంగారం ధరలను గమనిస్తే.. ఫిబ్రవరి 21న 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 56,730 రూపాయలు ఉండగా, మార్చి 2 నాటికి ఈ ధర రూ.56,450 వద్ద నిలిచింది. మొత్తంగా గత పది రోజుల బులియన్ మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని చెప్పొచ్చు. ఇక ప్రస్తుత ధరల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో గ్రాము బంగారం శుక్రవారం రోజు 5,175 రూపాయలు పలుకుతోంది. ఇక.. వెండి ధరలు కూడా శుక్రవారం నాడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం 70,200 రూపాయలు ఉండగా, శుక్రవారం నాడు 70,000 రూపాయలుగా ఉంది. కిలో బంగారంపై 200 రూపాయలు ధర తగ్గడం గమనార్హం. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
* ఢిల్లీ- రూ.51,900 (22K), రూ.56,600 (24K)
* చెన్నై-రూ.52,430 (22K), రూ.57,200 (24K)
* ముంబై- రూ.51,750 (22K), రూ.56,450 (24K)
* బెంగళూరు- రూ.51,800 (22K), రూ.56,500 (24K)
* విజయవాడ- రూ.51,750 (22K), రూ.56,450 (24K)
* విశాఖపట్నం- రూ.51,750 (22K), రూ.56,450 (24K)
Updated Date - 2023-03-03T07:53:21+05:30 IST