ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sundar Pichai: గూగుల్ సంచలన ప్రకటన..12 వేల మంది ఔట్!

ABN, First Publish Date - 2023-01-20T20:51:40+05:30

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) సంచలన ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికాలో ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా తీసివేత సమాచారం అందింది. మిగతా వారికి త్వరలోనే సమాచారం అందించనున్నట్టు గూగుల్ తెలిపింది. అన్ని ఉత్పత్తి ప్రాంతాల్లోనూ కఠినమైన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉద్యోగులకు రాసిన లేఖలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) పేర్కొన్నారు. పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించే విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పిచాయ్ పేర్కొన్నారు.

ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి 60 రోజుల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పిచాయ్ తెలిపారు. ఈ మొత్తం కాలానికి వేతనం చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. పరిహారం ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు గూగుల్‌లో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లించనున్నట్టు వివరించారు.

అర్హులైన ఉద్యోగులకు వారి కంట్రాక్టును బట్టి బోనస్, హెల్త్‌కేర్ బెనిఫిట్స్ ఇవ్వనున్నట్టు గూగుల్ సీఈవో తెలిపారు. అమెరికాకు ఆవల పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులకు అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు అందించనున్నట్టు చెప్పారు. ఉద్యోగులతో సోమవారం సమావేశం అవుతామని కూడా పిచాయ్ ఆ లేఖలో తెలిపారు.

టెక్ కంపెనీలన్నీ ఇటీవల వరుసగా ఉద్యోగుల తీసివేత బాట పట్టాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇటీవల 10 వేలమందిని తొలగించింది. మెటా(Meta), ట్విట్టర్ కూడా వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుండడాన్ని ఇవన్నీ సాకుగా చూపించాయి.

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌(Twitter)ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఆ కంపెనీలో దాదాపు 2 వేల మంది మాత్రమే ఉన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలైన హెచ్‌పీ, అడోబ్, సేల్స్‌ఫోర్స్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగులను ఎడాపెడా తొలగించాయి. అంతేకాదు, ఇండియన్ టెక్ కంపెనీలైన స్విగ్గీ(Swiggy), డంజో(Dunzo) సహా మరెన్నో సంస్థలు వందలాదిమందిని ఇంటికి పంపాయి.

Updated Date - 2023-01-20T21:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising