HDFC బ్యాంకు సీఈఓ జీతం ఎంతో తెలుసా? గతేడాది ఎన్ని కోట్లు ఇచ్చారో తెలిస్తే షాక్ అవడం పక్కా!
ABN, First Publish Date - 2023-07-20T17:36:32+05:30
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ జీతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఎంత కాదన్నా ఏడాదికి కోటి రూపాయలకు మించి ఉండకపోవచ్చు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ, ఎండీ శశిధర్ జగదీషన్‌కు గత వార్షిక సంవత్సరంలో అందించిన జీతం అక్షరాల రూ.10.55 కోట్లు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం.
బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీలో సాధారణ ఉద్యోగులకే జీతాలు భారీగా ఉంటాయి. పై స్థాయిలో ఉండే వారి జీతాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ పై స్థాయిలో ఉండే వారికి జీతాలు లక్షల్లోనే ఉంటాయి. మొత్తానికి వారి వార్షిక వేతనం లక్షల్లోనే ఉంటుంది. అయితే ఇదంతా సాధారణ ఉద్యోగుల జీతాల గురించే. కానీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ జీతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఎంత కాదన్నా ఏడాదికి కోటి రూపాయలకు మించి ఉండకపోవచ్చు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ, ఎండీ శశిధర్ జగదీషన్‌కు గత వార్షిక సంవత్సరంలో అందించిన జీతం అక్షరాల రూ.10.55 కోట్లు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. ఈ విషయం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడైంది.
దాని ప్రకారం 31 మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ, ఎండీ అయిన శశిధర్ జగదీషన్‌కు (HDFC Bank's CEO Sashidhar Jagdishan) రూ.10.55 కోట్ల జీతం అందింది. 2022 వార్షిక వేతనంతో పోలిస్తే ఇది రూ.4.03 కోట్లు ఎక్కువ కావడం విశేషం. కాగా 2022 ఆర్థిక సంవత్సరంలో శశిధర్ జగదీషన్‌కు రూ.6.52 కోట్ల వార్షిక వేతనం అందింది. గత ఆర్థిక సంవత్సరానికి అందిన రూ.10.55 కోట్ల వార్షిక వేతనంలో బేసిక్ జీతం రూ.2.82 కోట్లు, అలవెన్సులు, పెర్క్విసైట్‌ల రూపంలో రూ.3.31 కోట్లు, మెరుగైన పని తీరు కనబర్చినందుకు గాను బోనస్‌ల రూపంలో లభించినవి రూ.3.63కోట్లుగా ఉంది. 2020 - 2021లో మెరుగైన పనితీరు కనబర్చినందుకు నగదు వేరియబుల్ చెల్లింపులో భాగంగా రూ.1.05 కోట్లు కూడా అందించారు. RBI ఆమోదించిన మొత్తం నగదు వేరియబుల్ చెల్లింపులో ఇది 50 శాతంగా ఉంది. కాగా ఆర్బీఐ ఆమెదించిన మొత్తం నగదు వేరియబుల్ రూ.2.10 కోట్లుగా ఉంది. 2021-2022 సంవత్సరంలో జగదీషన్‌కు ఆర్బీఐ ఆమోదించిన మొత్తం నగదు వేరియబుల్ పే రూ.5.16 కోట్లుగా ఉంది. అందులో ఆయన ఇప్పటికే రూ.2.58 కోట్లు అందుకున్నారు. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 24 ఏళ్లుగా పని చేస్తున్న జగదీషన్ 2020 నుంచి సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా (HDFC Bank's executive director Kaizad Bharucha ) కూడా సీఈఓకు ఏ మాత్రం తగ్గకుండా జీతం అందుకున్నారు. 31 మార్చి 2023 వార్షిక సంవత్సరానికి రూ.10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారుచా జీతం స్వల్పంగా తగ్గింది. 31 మార్చి 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.10.64 కోట్లను వార్షిక వేతనంగా అందుకున్నారు. భారుచా వేతనంలో ప్రాథమిక వేతనంగా రూ.2.74 కోట్లు, అలవెన్సులు, పెర్క్విసిట్‌లలో రూపంలో రూ.4.36 కోట్లు, పనితీరు బోనస్ కింద రూ.2.18 కోట్లు ఉన్నాయి. కాగా ఇటీవల మార్కెట్ అంచనాలను మించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొదటి త్రైమాసికంలో లాభాలాను గడించింది. మొదటి త్రైమాసికంలో బ్యాంకు లాభాలు 30 శాతం పెరిగాయి. మనదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన HDFC బ్యాంక్, అధిక నికర వడ్డీ ఆదాయం, బలమైన రుణ వృద్ధి కారణంగా ఈ స్థాయి లభాలను కనబర్చింది.
Updated Date - 2023-07-20T17:37:48+05:30 IST