ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindenburg effect: దారుణంగా పడిపోయిన అదానీ ఆస్తి విలువ.. నెల రోజుల క్రితంతో పోలిస్తే..

ABN, First Publish Date - 2023-02-20T16:49:14+05:30

హిండెన్‌బర్గ్(Hindenburg) నివేదిక ప్రభావం భారత బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani)పై తీవ్ర ప్రభావం చూపించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్(Hindenburg) నివేదిక భారత బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani)పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆయన నికర ఆస్తి విలువ సగానికి పైగా క్షీణించింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) ప్రకారం.. ప్రస్తుతం అదానీ సంపద విలువ 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఆయన మొత్తం సంపద విలువ 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే రూ.4 లక్షల కోట్ల దిగువకు క్షీణించింది.

కాగా నెల రోజుల క్రితం 60 ఏళ్ల అదానీ 120 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించిన తర్వాత ఆయన సంపద క్రమంగా కరుగుతూ వచ్చింది. ఇప్పుడు సగానికి పైగా క్షీణించి 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది.

హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలయ్యాక స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువను దారుణంగా దెబ్బతీశాయి. అదానీకి చెందిన ఏడు ప్రధాన కంపెనీలు మొత్తంగా 120 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన హిండెన్‌బర్గ్ నివేదిక కుట్రపూరితమని, పూర్తి అవాస్తవాలతో నివేదికను తయారుచేశారంటూ అదానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నివేదికను అదానీ గ్రూప్ తిప్పికొట్టినప్పటికీ ఇన్వెస్టర్లలో భయాల కారణంగా లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ క్రమంగా దిగజారుతూ వచ్చింది.

ఈ నివేదిక అదానీ వ్యక్తిగత సంపదపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన సంపద 71 బిలియన్ డాలర్లు పడిపోయింది. నికర విలువ వేగంగా పడిపోవడంతో ఆసియా సంపన్నడి హోదాను ముకేశ్ అంబానీకి కోల్పోయారు.

Updated Date - 2023-02-20T17:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising