కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ITR Filing Last Date: వర్షాలు, కరెంట్ కోతలంటూ ఫిర్యాదులు.. ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు సర్కారు మరో ఛాన్స్ ఇస్తుందా..?

ABN, First Publish Date - 2023-08-01T12:36:22+05:30

కుండపోత వర్షాలు, వరదల కారణంగా కరెంట్ కోత, సర్వర్ల పనితీరు దెబ్బతిన్నదని పన్ను చెల్లింపు సేవలలో అంతరాయం ఏర్పడిందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఐటీఆర్ దాఖలుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కానీ గత నాలుగేళ్లలో జిరిగంది గమనిస్తే..

ITR Filing Last Date: వర్షాలు, కరెంట్ కోతలంటూ ఫిర్యాదులు.. ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు సర్కారు మరో ఛాన్స్ ఇస్తుందా..?

ఐటీఆర్ దరఖాస్తుకు చివరితేదీ జులై 31 అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ తేదీలోపు పన్నుచెల్లింపుదారులు అందరూ తమ ఆదాయ వివరాలను పైల్ చేయాలని, పన్నులు చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. సోషల్ మీడియా వేదికగా పలు వార్తా సైట్లు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు దీని గురించి అప్రమత్తం చేస్తూ వచ్చాయి. ఫోన్ పే లాంటి డిజిటల్ మనీ యాప్స్ కూడా తమ యాప్ లో ఇంట్లో కూర్చునే పన్ను చెల్లించవచ్చంటూ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చి పన్ను చెల్లింపు సేవలు మరింత సులభతరం చేసింది(Tax payment in Phone pe App). అయితే జులై నెల మధ్య నుండి భీభత్సమైన వర్షాలు(heavy rains), కరెంట్ కోతలలో(power cut) దేశమంతా అతలాకుతలం అయ్యింది. ఈ కారణంగా చాలామంది పన్ను చెల్లింపు సేవలలో అంతరాయం ఏర్పడిందని, తాము పన్ను చెల్లించలేకపోయామని ఫిర్యాదులు చేస్తున్నారు. ఐటీఆర్ దాఖలుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎప్ ప్రకారం ఎవరైనా తమ ఐటీఆర్ లను నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే ఆ తరువాత జరిమానాతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఆలస్యంగా పైల్ చేస్తే దానికి 5వేల రూపాయల జరిమానా చెల్లించాలి. వార్షిక ఆదాయం 5లక్షల కంటే తక్కువ ఉంటే రూ.1000 జరిమానా చెల్లించాలి. జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయనివారికి ఇప్పటికే చలానా కట్టమంటూ ప్రభుత్వం నుండి సందేశాలు కూడా వస్తున్నాయి. కానీ దేశంలో చాలా మంది సైట్ పనిచేయడం లేదని, సర్వస్ ప్రాబ్లం ఉందని, ప్రొసీడ్ బటన్ పనిచేయడం లేదని, లాగిన్ సమస్య ఉందని సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను ఏకరువు పెడుతున్నారు. చాలామంది సెప్టెంబర్ 23వరకు, మరికొందరు ఆగస్టు 31 వరకు సమయం పొడిగించండి అంటూ ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. ఈ అభ్యర్థన మేరకు కొన్ని రాష్ట్రాలు గడువు పెంచమంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ఈ నెల ప్రారంభంలోనే ప్రజలను హెచ్చరించారు. ముగింపు సమయం వచ్చే వరకు ఐటీఆర్ దాఖలుకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ముగించుకోమని చెప్పారు.

Viral Video: రైతే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ట్రాక్టర్ ను ఎలా మార్చేశాడో చూస్తే ..



గత నాలుగేళ్ళలో ఐటీఆర్ దాఖలు విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తే.. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు 2019-20 సంవత్సరంలో చెల్లించాల్సి ఉండగా కరోనా కారణంగా ఆ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ఐటీఆర్ దరఖాస్తు సమయాన్ని పొడిగించారు. అదే విధంగా 2020-2021 సంవత్సరానికి చెందిన ఐటీఆర్ దారఖాస్తు 2021-2022లో చెల్లించాల్సి ఉండగా అప్పుడు కూడా డిసెంబర్ 31వరకు గడువు పెంచారు. గత ఏడాది మాత్రం ఈ గడువు పొడిగింపు చర్యలు ఏమీ లేవు. ఈ ఏడాది కూడా గడువు పొడిగింపు చర్య ఉండబోదని కేంద్రం ముందే కుండ బద్దలు కొట్టి చెప్పింది కూడా. ఇప్పటికే లక్షమందికి పైగా జరిమానా కట్టాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు అందుకున్నారు. దీంతో జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయినవారికి ఈ ఏడాది జరిమానా తప్పేలా లేదన్నదని విశ్లేషకులు చెబుతున్న మాట.

LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్ చెప్పినట్టే చెప్పి బాంబు పేల్చిన కంపెనీలు.. గ్యాస్ సిలిండర్ రేట్లు ఆగస్టు నెల నుంచి ఎంతంటే..!


Updated Date - 2023-08-01T12:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising