కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ITR Filing: జూలై 31వ తారీఖు లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారా..? ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ ఏమిటంటే..!

ABN, First Publish Date - 2023-08-01T14:21:45+05:30

జులై 31లలోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయినవారికి ఒకే ఒక్క ఆప్షన్ మిగిలుంది.ఇది కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత చాలా నష్టాలు ఎదుర్కోవాలి.

ITR Filing: జూలై 31వ తారీఖు లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారా..? ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ ఏమిటంటే..!

ఈ ఏడాది జులై 31వ తేదీ నాటికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలుకు గడువు ముగిసింది. జులై నెల చివరి 15రోజులు దేశవ్యాప్తంగా భీభత్సమైన వర్షాలు కురవడం వల్ల పలుచోట్ల సెల్ టపర్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల సిగ్నల్స్ అందలేదు. ఇక గడువుకు మూడు, నాలుగు రోజుల ముందునుండి ఐటీఆర్ దాఖలుతు ఎగబడటంతో సైట్ పనితీరు మందగించింది. సైట్ లో పలు ఆప్షన్ లు పనిచేయలేదని, ఐటీఆర్ దాఖలు చేయలేకపోయామని పన్ను చెల్లింపుదారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం నెల ముందే ఐటీఆర్ దాఖలుకు ఎలాంటి గడువు పెంచేదిలేదని గంటాపథంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో జులై 31లలోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయినవారికి ఒకే ఒక్క ఆప్షన్ మిగిలుంది.ఇది కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత చాలా నష్టాలు ఎదుర్కోవాలి. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ప్రభుత్వం నుండి ఎలాంటి గడువు లభించదనే వార్తలు ప్రచారమవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఐటీఆర్ చెల్లింపుకు ఇప్పుడు మిగిలున్న ఆప్షన్(last option for ITR filing) జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయడం. 5లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానాతో, 5లక్షల పైన ఆదాయం ఉన్నవారు రూ.5000 జరిమానాతో డిసెంబర్ 31వ తేదీ లోపు చెల్లించాలి. ఒకవేళ 31వ తేదీలోపు కూడా జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే డిసెంబర్ 31 తరువాత నుండి ఈ జరిమానా 10వేల రూపాయలకు పెరుగుతుంది. అదిమాత్రమే కాకుండా పన్నులు చెల్లించాల్సిన సమయానికి రిటర్న్ పైల్ చేయనందుకు, తిరిగి రిటర్న్ ఫైల్ చేసేవరకు నెలకు 1శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు చెల్లించాల్సిన పన్ను చెల్లించనందుకు గానూ మార్చి 31, 2024 వరకు 25శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆ తరువాత కూడా ఐటీఆర్ ఫైల్ దాఖలు చేయలేకపోయినా, పన్ను చెల్లించకపోయినా 50శాతం అదనపు పన్ను చెల్లించాలి.

LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్ చెప్పినట్టే చెప్పి బాంబు పేల్చిన కంపెనీలు.. గ్యాస్ సిలిండర్ రేట్లు ఆగస్టు నెల నుంచి ఎంతంటే..!



ఐటీఆర్ దాఖలు గురించి, పన్ను చెల్లింపు గురించి హెచ్చరికలు వచ్చినా వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆదాయాన్ని దాచిపెట్టినట్టు, తప్పుగా చూపించినట్టు పరిగణింపబడుతుంది. దీనివల్ల 50శాతం అదనపు పన్ను, 200శాతం అధిక జరిమానా విధించబడతాయి. పన్ను బాకీ ఆధారంగా 3నెలల నుండి 7సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. పన్ను రీఫండ్‌లలో జాప్యం, ఆలస్యంగా దాఖలు చేయడం జరిగితే ఇది ఆర్థిక ఒత్తిడికి, అసౌకర్యానికి కారణమవుతుంది. ఆలస్యంగా దాఖలు చేసేవారు పన్ను అధికారుల కంట్లో పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల విచారణలు, వివరణలు వంటివి చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే గోరంత తప్పును కొండంత చేయకుండా డిసెంబర్ 31లోపు జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయడం ఉత్తమం.

ITR Filing Last Date: వర్షాలు, కరెంట్ కోతలంటూ ఫిర్యాదులు.. ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు సర్కారు మరో ఛాన్స్ ఇస్తుందా..?


Updated Date - 2023-08-01T14:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising