కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ కు లాస్ట్ ఛాన్స్..అధికారుల హెచ్చరిక

ABN, Publish Date - Dec 29 , 2023 | 01:34 PM

మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేయాలని..ఇదే చివరి అవకాశమని అధికారులు ప్రకటించారు.

ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ కు లాస్ట్ ఛాన్స్..అధికారుల హెచ్చరిక

2022-23 ఆర్థిక సంవత్సరానికి(2023-24 అసెస్ మెంట్ ఇయర్) సంబంధించి మీరు ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా అయితే జాగ్రత్త. ఎందుకంటే డిసెంబర్ 31 చివరి తేదీ అని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆలస్యంగా జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసి ఏదైనా తప్పులు ఉన్నా కూడా సరిచేసుకునేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ క్రమంలో గడువులోపు పన్ను రిటర్నులు చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ఐటీ అధికారులు సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి అలర్ట్ చేశారు.


అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాలి. ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మీరు ఐటీఆర్ దాఖలు చేయకపోవడానికి గల కారణాలను కూడా ఐటీ అధికారులు అడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో దాఖలు చేయని వారిపై చర్యలు తీసుకుంటారు. వారికి ఫైన్ కూడా విధిస్తారు.

ప్రస్తుతం ఐటీ యాక్టులోని సెక్షన్ 23ఎఫ్ ప్రకారం వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న వ్యక్తులు ఆలస్యంగా రూ.1000 జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉన్న వారు రూ.5000 చెల్లించాలి. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం 2020-21 నుంచి ప్రతి ఒక్కరూ ఐటీఆర్ దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేశారు. అయితే ఐటీఆర్ దాఖలు చేసే వ్యక్తులు వారి వార్షిక ఆదాయాన్ని బట్టి జరిమానా ఉంటుంది.

Updated Date - Dec 29 , 2023 | 01:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising