Mahindra Scorpio: స్కార్పియో క్లాసిక్ ధరను భారీగా పెంచేసిన మహీంద్రా
ABN, First Publish Date - 2023-01-31T21:32:32+05:30
భారతీయ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా(Mahindra) తన ‘స్కార్పియో క్లాసిక్’(Scorpio Classic) ధరను ఏకంగా రూ. 65 వేలు పెంచేసింది.
న్యూఢిల్లీ: భారతీయ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా(Mahindra) తన ‘స్కార్పియో క్లాసిక్’(Scorpio Classic) ధరను ఏకంగా రూ. 65 వేలు పెంచేసింది. ఎస్, ఎస్11 వేరియంట్లు రెండింటికీ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. స్కార్పియో-ఎన్‌తో పాటు స్కార్పియో క్లాసిక్‌ను గతేడాది విడుదల చేసింది.
ధర పెంపుతో స్కార్పియో క్లాసిక్ ‘ఎస్’ వేరియంట్ ప్రారంభ ధర రూ. 12.64 లక్షలకు పెరిగింది. ‘ఎస్ 11’ వేరియంట్ ధర రూ.16.14 లక్షలకు చేరుకుంది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మునుపటి తరం స్కార్పియోలా కాకుండా ఇది 2.2 లీటర్ ఎంహాక్( mHawk) ఫోర్ సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తోంది. ఇది 130bhp, 300Nm వద్ద గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
స్కార్పియో క్లాసిక్ ఎస్, ఎస్11 వేరియంట్‌లు రెండూ 7 సీటర్‌లే. ఇందులో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సెంటర్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, లెదరైట్ ఫినిష్‌తో స్టీరింగ్ వీల్ ఉన్నాయి. అలాగే డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు పానిక్ బ్రేక్ ఇండికేషన్, హై స్పీడ్ అలర్డ్, బెల్ట్ రిమైండర్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొత్తగా ఫ్రంట్ బంపర్ ను రీస్టైలింగ్ చేశారు. అలాగే, కొత్తగా ఎల్ఈడీ డీఆర్ ఎల్స్ ను ఏర్పాటు చేశారు. బేస్ ‘ఎస్’ వేరియంట్ వినైల్ అప్‌హోల్‌స్టెరీ, స్టీల్ వీల్స్, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది.
Updated Date - 2023-01-31T21:32:34+05:30 IST