ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maruti Suzuki: మారుతీ సుజుకీ నుంచి కొత్త కారు.. ధర ఎంతో తెలుసా.. మారుతీ కార్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక రేటు..

ABN, First Publish Date - 2023-07-05T15:38:45+05:30

మారుతీ సుజకీ ఇండియా (Maruti Suzuki India) భారతీయ మార్కెట్‌లో బుధవారం మరో కొత్త కారును ఆవిష్కరించింది. ‘ఇన్విక్టో’ (Invicto ) పేరిట 3 వేరియెంట్లు జెటా+ (Zeta+) 7 సీటర్, జెటా+ ( Zeta+) 8 సీటర్, ఆల్ఫా+ (Aplha+) 7 సీటర్‌తో విడుదల చేసింది. మొదటి వేరియెంట్ ఆరంభ ధర రూ.24.84 లక్షలు.. కాగా టాప్ వేరియెంట్ ధర రూ.28.42 లక్షలుగా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మారుతీ సుజకీ ఇండియా (Maruti Suzuki India) భారతీయ మార్కెట్‌లో బుధవారం మరో కొత్త కారును ఆవిష్కరించింది. ‘ఇన్విక్టో’ (Invicto ) పేరిట 3 వేరియెంట్లు జెటా+ (Zeta+) 7 సీటర్, జెటా+ ( Zeta+) 8 సీటర్, ఆల్ఫా+ (Aplha+) 7 సీటర్‌తో విడుదల చేసింది. మొదటి వేరియెంట్ ఆరంభ ధర రూ.24.84 లక్షలు.. కాగా టాప్ వేరియెంట్ ధర రూ.28.42 లక్షలుగా ఉన్నాయి. ఇక మధ్య వేరియెంట్ ధర రూ.24.84 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది. నెలకు రూ.61,860 సబ్‌స్ర్కిప్షన్‌తో కూడా ‘ఇన్విక్టో’ను కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. నెగ్జా బ్లూ, మైస్టిక్ వైట్ సహా 4 రంగుల్లో ఈ కార్లు లభిస్తాయి. నెగ్జా శ్రేణి కారుల్లో ఇది 8వ మోడల్ కారు కావడం గమనార్హం. మారుతీ నుంచి ఇన్విక్టో (Invicto) మార్కెట్‌లో సరికొత్త మోడల్ అవనుందని, నెగ్జా ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించనున్నట్టు కంపెనీ వివరించింది.

ఇక ఈ సరికొత్త కారు 2.0 పెట్రోల్ ఇంజన్, ఒక హైబ్రీడ్ మోటార్‌తో రూపొందించారు. పెట్రోల్ ఇంజన్ 172బీహెచ్‌పీ పవర్ జనరేట్ చేయనుండగా.. టార్క్ 188ఎన్ఎమ్‌గా ఉంది. ఆఫర్‌పై లభించే వాటిలో ఈ-సీవీటీ యూనిట్ మాత్రమే ఉంది. కొత్త కారు విడుదలపై మారుతీ సుజుకీ ప్రతినిధి శశాంక్ శ్రీవాస్తవ స్పందించారు. మార్కెట్‌లో కంపెనీ విక్రయాల పెరుగుదలకు కొత్త కారు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 24 శాతం వృద్ధిని ఆశించామన్నారు. మార్కెట్‌లో తమ వాటా పెంచుకోవడమే తమ లక్ష్యమన్నారు. కాగా జూన్ నెలలో మారుతీ సుజుకీ ఇండియా విక్రయాల్లో గతేడాదితో పోల్చితే 8.5 శాతం వృద్ధితో 133,027 యూనిట్లు విక్రయించింది. ఇక రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. మారుతీకి చెందిన యుటిలిటీ వాహనాల విక్రయాలు రెట్టింపుపైగా పెరిగాయని గతేడాది రిపోర్ట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-05T15:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising