ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maruti Suzuki Tour H1: మారుతి నుంచి సరికొత్త కమర్షియల్‌ కారు విడుదల.. ప్రత్యేకతలివే..

ABN, First Publish Date - 2023-06-11T12:38:05+05:30

ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి మార్కెట్‌లోకి కొత్త కారును విడుదల చేసింది. మారుతి ఆల్టో K10కి వాణిజ్య వెర్షన్‌‌గా మారుతి సుజుకి టూర్ H1(Tour H1)ని లాంచ్‌ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10కి ఈ మారుతి టూర్ హెచ్1(Maruti Suzuki Tour H1) వాణిజ్య వెర్షన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి(Maruti Suzuki) మార్కెట్‌లోకి కొత్త కారును విడుదల చేసింది. మారుతి ఆల్టో K10కి(Suzuki Alto K10) వాణిజ్య వెర్షన్‌‌గా మారుతి సుజుకి టూర్ H1(Tour H1)ని లాంచ్‌ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10కి ఈ మారుతి టూర్ హెచ్1(Maruti Suzuki Tour H1) వాణిజ్య వెర్షన్.

మారుతి సుజుకి కార్లు బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉండటమే కాకుండా అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తాయి. అందుకే ఈ ఇండో జపనీస్ జాయింట్ వెంచర్ ప్రతి నెలా లక్షల కార్లను మార్కెట్‌లో విక్రయించగలుగుతోంది. అంతే కాకుండా ఇతర బ్రాండ్ల మాదిరిగానే, వాణిజ్య అవసరాల కోసం కూడా మారుతి సుజుకి బ్రాండ్‌లో కార్లు మార్కెట్లు విక్రయిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో ఆల్టో మోడల్స్ 'టూర్' పేరుతో విక్రయిస్తోంది. తాజాగా విడుదలైన మారుతి సుజుకి టూర్ H1 రెండు వెర్షన్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT టెక్‌తో ఒకే 1.0 లీటర్ K సిరీస్ ఇంజిన్‌ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రెండు వెర్షన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి.

మారుతి సుజుకి టూర్ H1 పెట్రోల్, CNG రెండు ట్యాంకుల్లో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి టూర్ H1 పెట్రోల్ ఇంజిన్‌ లీటర్‌కు 24.6km మైలేజీని అందిస్తుంది. ఇది 27 లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. మరోవైపు మారుతి సుజుకి టూర్ H1 CNG ను పరిశీలిస్తే.. 34.46km మైలేజీని అందిస్తుంది. ఇది 55-లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది.

Updated Date - 2023-06-11T12:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising