ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aera electric bike: ఎలక్ట్రిక్ బైక్‌కూ గేర్లు.. వచ్చేసిన ‘ఎరా’..ఇక మీదే ఆలస్యం!

ABN, First Publish Date - 2023-03-02T17:48:28+05:30

మేటర్(Matter) ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ ‘ఎరా’(Aera)ను విడుదల చేసింది. ఎరా 4000, ఎరా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: మేటర్(Matter) ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ ‘ఎరా’(Aera)ను విడుదల చేసింది. ఎరా 4000, ఎరా 5000, ఎరా 5000 ప్లస్, ఎరా 6000 ప్లస్ పేర్లతో పలు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎరా 5000 ధర రూ. 1,43,999 లక్షలు కాగా, 5000 ప్లస్ వేరియంట్ ధర రూ.1,53,999 లక్షలు. బైక్ రిజిస్ట్రేషన్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. మేటర్ 5kWh, 6kWh లిక్విడ్ కూల్‌డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. స్పోర్టీ లుక్స్, అత్యాధునిక సాంకేతికతో వస్తున్న ఈ బైక్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మ్యాటర్ ఈవీ బైక్ యూత్‌ఫుల్, ప్రాక్టికల్ డిజైన్‌తో చూడగానే ఆకర్షించేలా ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ప్లిట్ సీట్ సెటప్ వంటివి ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 125 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రెగ్యులర్ చార్జర్ సెటప్‌తో ఎరా 5000 బ్యాటరీ 5 గంటల్లోనూ పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జర్‌తో అయితే రెండు గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. మోటర్ సెటప్‌ కోసం ఫోర్ స్పీడ్ మాన్యుయల్ గేర్ షిఫ్ట్ లివర్ ఉంది.

ఈ సందర్భంగా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహల్‌ లాల్‌భాయ్ మాట్లాడుతూ.. ఎరా తమ దృక్పథం మార్పును సూచిస్తుందన్నారు. ఈవీ రంగంలో అంచనాలను తలకిందులు చేసే మార్పులను రూపొందించేందుకు తాము ప్రయత్నించలేదని, దేశంలో ఈవీ స్థిరమైన మొబిలిటీ కోసం, విస్తృత వినయోగం మార్గాలను రూపొందించినట్టు తెలిపారు. అత్యంత అధునాతన మోటార్‌బైక్ ‘ఎరా’ను అందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

మేటర్‌ గ్రూప్‌ కో ఫౌండర్, సీటీవో కుమార్‌ ప్రసాద్‌ తెలికేపల్లి మాట్లాడుతూ.. మేటర్‌ ద్వారా కొత్త మొబిలిటీ రూపాలు, అనుభవాలను రూపొందించేందుకు సాంకేతికత ఆవిష్కరణలతో నిరంతరం పని చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఎల్లప్పుడూ కొత్త ఉత్పత్తులు రూపొందించేందుకు తమ బృందాల లోతైన ఆలోచన ప్రక్రియ కృషి చేస్తుందన్నారు.

Updated Date - 2023-03-02T17:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!