Matter: ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈవీ గేర్డ్ బైక్ ‘ఎరా’ ప్రీ బుకింగ్
ABN, First Publish Date - 2023-04-29T21:07:24+05:30
దేశంలోనే తొలిసారి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ‘ఎరా’(AERA)ను తీసుకొచ్చిన టెక్ ఇన్నోవేషన్ స్టార్టప్
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ‘ఎరా’(AERA)ను తీసుకొచ్చిన టెక్ ఇన్నోవేషన్ స్టార్టప్ ‘మ్యాటర్’(Matter).. బైక్‌ల ముందస్తు బుకింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో భాగస్వామ్యం చేసుకుంది. దీంతో ‘ఎరా’ను అత్యంత సౌకర్యవంతంగా కొనుగోలు చేసుకునే అవకాశం వినియోగదారులకు లభించింది. ఇందులో ప్రత్యేక ఆఫర్లను సైతం అందిస్తోంది.
ఈ సందర్భంగా మ్యాటర్ గ్రూప్ సీఈవో, ఫౌండర్ మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ, ప్రతి ప్రాంతానికి విద్యుత్ వాహనాలను చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ద్వారా వినియోగదారులను విస్తృతంగా చేరుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ ఆటోమొబైల్స్ డైరెక్టర్, కేటగిరీ హెడ్ భరత్ కుమార్ బీఎస్ మాట్లాడుతూ.. దేశపు మొట్టమొదటి గేర్డ్ మోటార్ సైకిల్ అయిన మ్యాటర్ ఎరాను ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ చేసుకోవడంతోపాటు కొనుగోలు కూడా చేయవచ్చన్నారు. అలాగే, ఆఫర్లు, ప్రయోజనాలను కూడా పొందొచ్చని పేర్కొన్నారు. మ్యాటర్‌తో తమ భాగస్వామ్యం మరింతగా కొనసాగించడంతో పాటు తమ ఈవీ ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తామని చెప్పారు.
Updated Date - 2023-04-29T21:07:24+05:30 IST