కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నిత్యావసరాల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో...

ABN, First Publish Date - 2023-08-10T10:56:07+05:30

కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కీలకమైన రెపో రేటు 6.50 శాతంగా మార్పుల్లేకుండా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీసీలో (Monetary Policy Committee) నిర్ణయించామని, కమిటీలోని ఆరుగురు సభ్యులు ఇందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు.

RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నిత్యావసరాల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో...

ముంబై: కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కీలకమైన రెపో రేటు 6.50 శాతంగా మార్పుల్లేకుండా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shaktikanta Das) గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీసీలో (Monetary Policy Committee) నిర్ణయించామని, కమిటీలోని ఆరుగురు సభ్యులు ఇందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. ‘‘ సంబంధిత అన్ని కోణాల్లో సమగ్రంగా చర్చించిన తర్వాత రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది’’ అని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఇక ఎస్‌డీఎఫ్ (Standing deposit facility) రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ (Marginal standing facility), బ్యాంక్ రేటు 6.75 శాతంగా మార్పుల్లేకుండా కొనసాగుతాయని చెప్పారు.


వృద్ధికి ఊతమిస్తూనే ద్రవ్యోల్బణం కట్టుతప్పకుండా పరిమితికి లోబడి ఉండేలా అవసరమైతే సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకునేందుకు ఆరుగురులోని 5 మంది సభ్యుల సమ్మతితో ఎంపీసీ నిర్ణయించిందని తెలియజేశారు. అయితే గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతున్న ధరల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర బ్యాంక్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Updated Date - 2023-08-10T10:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising