ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rs 2000 Notes: రూ.2వేల నోట్ల మార్పిడి ఇలా.. ఈ పాయింట్లు ఎంత ఉపయోగపడతాయంటే..

ABN, First Publish Date - 2023-05-23T18:38:20+05:30

మార్కెట్లో రూ.2వేల నోట్ల చెలామణిని రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఆర్‌బీఐ క్లీన్‌ నోట్‌ పాలసీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్లో రూ.2వేల నోట్ల చెలామణిని రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఆర్‌బీఐ క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా చెలామణి నుంచి రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ఆర్‌బీఐ ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది.

గడువు లోపు రూ.2వేల నోట్లు ఉన్న వారు తమ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి అంతే మొత్తం విలువ గల ఇతర కరెన్సీ తీసుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. అన్ని బ్యాంకులు రూ.2వేల నోట్లను ఇక నుంచి కస్టమర్లకు ఇవ్వరాదని ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

* ఈ రోజు(మంగళవారం) నుంచి బ్యాంకు క్యాష్‌ చెస్ట్‌ల నుంచి రూ.2వేల నోట్లు బయటకు తీయరాదు.

* అన్ని బ్యాంకులు రూ.2వేల నోట్లను వేరు చేసి నోట్‌ సార్టింగ్‌ మిషన్‌ ద్వారా వాటిని పరిశీలించి వీటి ఒరిజినాలిటిని ధ్రువీకరించుకోవాలి.

* సెప్టెంబరు 30 వరకు రూ 2 వేల నోట్లను బ్యాంకు కౌంటర్లలో డిపాజిట్‌ చేయాలి లేదా చిల్లరగా మార్చుకోవాలి.

* అన్ని బ్యాంకు శాఖలు రూ 2 వేల నోట్లు డిపాజిట్లు, మార్పిడిని అంగీకరించాలి.

* బ్యాంకులు ఎటువంటి నిబంధనలు పెట్టకుండా రూ.2 వేల నోట్లు డిపాజిట్‌కు, నోట్ల మార్పిడికి అనుమతించాలి.

* అన్ని బ్యాంకు శాఖలు రోజుకు గరిష్ఠంగా రూ. 20వేల వరకు రూ. 2వేల నోట్లను డిపాజిట్‌ చేసుకోనేందుకు, మార్పిడికి అనుమతించారు.

* బిజినెస్‌ కరస్పాండెంట్లు రోజుకు ఒక్కో ఖాతాదారునికి రూ. 4వేల రూపాయల వరకు రూ. 2వేల నోట్లను మార్పిడికి అవకాశం కల్పించారు.

* ఈనెల 23 నుంచి ప్రజలు బ్యాంకులకు వెళ్ళి తమ రూ. 2వేల నోట్లను డిపాజిట్‌, మార్పిడి చేసుకోవాలి.

* జన్‌ధన్‌ యోజన బ్యాంకు ఖాతాల్లో కూడా రూ. 2వేల నోట్లు డిపాజిట్‌ చేయవచ్చు.

Updated Date - 2023-05-23T18:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising