Campa: ఇక దేశ్యాప్తంగా అందుబాటులోకి క్యాంపా.. ఉడాన్‌తో రిలయన్స్ ఒప్పందం
ABN, First Publish Date - 2023-04-27T18:26:57+05:30
రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీకి చెందిన రిలయన్స్ కన్జుమర్ ప్రొడక్ట్స్ (RCPL)- బి2బి (B2B) ఈ-
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీకి చెందిన రిలయన్స్ కన్జుమర్ ప్రొడక్ట్స్ (RCPL)- బి2బి (B2B) ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉడాన్ (Udaan)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఇకపై రిలయన్స్ పానీయాల బ్రాండ్ ‘క్యాంపా’ శ్రేణి దేశవ్యాప్తంగా రిటైలర్లు, కిరాణా స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది. తొలుత 50 వేల రిటైలర్ల వద్ద ఇది అందుబాటులో ఉంటుంది. వచ్చే రెండు నెలల్లో లక్ష కిరాణా స్టోర్లకు దీనిని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
క్యాంపా 200 మిల్లీ లీటర్లు, 500 మిల్లీ లీటర్లు, 2 వేల మిల్లీ లీటర్ల ప్యాక్‌లలో వివిధ ధరల్లో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ గత నెలలోనే తమ బేవరేజ్ బ్రాండ్ క్యాంపాను కోలా, ఆరెంజ్, లెమన్ ఫ్లేవర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ శీతల పానీయం విడుదలతో రియల్స్ ఎఫ్ఎంసీజీ పోర్టుఫోలియో మరింత బలోపేతం కానుంది.
ఉడాన్‌లోని ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ వినయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ వేసవిలో దేశీయ వినియోగదారులకు ‘ది గ్రేట్ ఇండియన్ టేస్ట్’ను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా క్యాంపా శ్రేణి చొచ్చుకుపోయేందుకు ఉడాన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ బీ2బీ ఈ-రిటైలర్ తన పరిధిని 10 వేల పట్టణాలు, గ్రామాలకు విస్తరించేందుకు కృషి చేస్తోంది. 3 వేల వరకు జనాభా ఉన్న ప్రతీ మార్కెట్లోనూ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించామని, పది జిల్లాల్లోని 15 వేల మంది రిటైర్లకు విస్తరించామని ఉడాన్ వివరించింది.
Updated Date - 2023-04-27T18:26:57+05:30 IST