Gold: జువెల్లర్స్‌కు షాక్.. ఆ రోజు తర్వాత అలాంటి ఆభరణాలు అమ్మకూడదంతే!
ABN, First Publish Date - 2023-03-03T19:14:39+05:30
దుకాణంలోకి వెళ్లి బంగారు నగల(Gold Jewellery)ను కొనాలంటే ఒకటికి పదిసార్లు
న్యూఢిల్లీ: దుకాణంలోకి వెళ్లి బంగారు నగల(Gold Jewellery)ను కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఆ బంగారం(Gold) ఎలాంటిదో? స్వచ్ఛమైనదేనా? మోసం ఉండదు కదా? వంటి భయాలు వినియోదారులను వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పిస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS) బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్(Hallmark)ను తప్పనిసరి చేసింది. ఇప్పుడు వినియోగదారుల మంత్రిత్వశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) లేని ఆభరణాల విక్రయాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొంది.
హెచ్‌యూఐడీ అనేది నంబర్లు, అక్షరాలతో కూడిన 6 అంకెల కోడ్. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి ఓ ప్రత్యేకమైన హెచ్‌యూఐడీ కోడ్ కేటాయిస్తారు. దీనిని లేజర్‌తో చెక్కుతారు. ఈ నంబరు బీఐఎస్ డేటాలో భద్రపరుస్తారు. 1 జులై 2021లో తొలిసారి దీనిని ప్రవేశపెట్టారు.
దీనివల్ల వినియోగదారులకు ఏంటి ప్రయోజనం?
హెచ్‌యూఐడీ ఆధారిత హాల్‌మార్కింగ్ వల్ల పారదర్శకత లభిస్తుంది. ఇది వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. వినియోగదారుల హక్కులను ఇది కాపాడుతుంది. ఎవరైనా సరే ఇప్పటికే ఉన్న ఆభరణాలను హాల్‌మార్క్ చేయించుకుని దాని నిజమైన విలువను పొందొచ్చు.
Updated Date - 2023-03-03T19:14:39+05:30 IST