ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamota Prices: ఎంత పనిచేశావే.. మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు

ABN, First Publish Date - 2023-09-01T16:25:41+05:30

వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలలో డిమాండ్ క్షీణించడం, అంతేకాకుండా పొరుగున ఉన్న నేపాల్ నుంచి టమోటాల దిగుమతి వంటి అంశాల నేపథ్యంలో టమోటా ధరలు ఒక్కసారిగా ఆకస్మికంగా తగ్గాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బహిరంగ మార్కెట్‌లో రూ.100కు నాలుగు కిలోలను విక్రయిస్తున్నారు.

ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని కొందరు అంటుంటారు. ఇది మనుషులకే కాకుండా కూరగాయలకు కూడా వర్తిస్తుందని ప్రస్తుతం కొందరు చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు కాసులు పలికించిన టమోటా.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. 30 రోజుల కిందటి వరకు కిలో టమోటా రూ.300కి పైగా పలికింది. కానీ ప్రస్తుతం ఒక్కసారిగా టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. ఏపీలోని మదనపల్లి మార్కెట్‌లో కిలో టమోటా కేవలం రూ.9గా పలుకుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమోటాలతో కోటీశ్వరులు అయిన కొందరు రైతులను చూసి ఆనందించిన వారికి ఇప్పుడు తాజా పరిస్థితులు ఆవేదనకు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలలో డిమాండ్ క్షీణించడం, అంతేకాకుండా పొరుగున ఉన్న నేపాల్ నుంచి టమోటాల దిగుమతి వంటి అంశాల నేపథ్యంలో టమోటా ధరలు ఒక్కసారిగా ఆకస్మికంగా తగ్గాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బహిరంగ మార్కెట్‌లో రూ.100కు నాలుగు కిలోలను విక్రయిస్తున్నారు. కేవలం కిలో కొనుగోలు చేసేవాళ్ల దగ్గర మాత్రం వ్యాపారులు రూ.30 తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలలోనూ కిలో టమోటా రూ.20 నుంచి రూ.30 మధ్యలో పలుకుతున్నాయి. కర్ణాటకలోని మైసూరులో కిలో టమోటాను రూ.18 వరకు విక్రయిస్తున్నారు. అయితే రానున్న కాలంలో టమోటా ధరలు మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: పెళ్లి విందులో ఆహ్లాదంగా విందు భోజనం చేస్తున్న అతిథులు.. అంతలో ఏమైందో చూస్తే షాకవడం ఖాయం!

రెండు నెలల క్రితం టమోటాను సంప్రదాయంగా పండిస్తున్న రైతుల్లో కొందరు సంపన్నులుగా మారిపోయారు. చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో కిలో టమోటా రూ.250, రూ.300 వరకు పలకడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. టమోటాను కొనుగోలు చేయడం, వండటం మానేశారు. కొందరు వ్యాపారులు టమోటాలు విక్రయించాలంటే సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనించాం. ఒక్కో టమోటా రూ.30 పలికిన కొన్ని రోజుల తర్వాత అదే ధరకు కిలో టమోటాలు వస్తుండటం గమనించాల్సిన విషయం. ఎంతో ఆశగా టమోటా పంటలను వేసిన రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. టమోటా ఎంత పని చేశావె అని దిగులు చెందుతున్నారు.

Updated Date - 2023-09-01T16:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising