Money Savings: డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే సరిపోదు.. ఈ అలవాట్లు నేర్చుకున్నవారు మాత్రమే రిచ్ అవుతారు!..
ABN, First Publish Date - 2023-06-20T22:27:12+05:30
సకాలంలో అప్పులు చెల్లించడం అత్యంత తెలివైన పని. అలా నడుచుకుంటే చెల్లించాల్సినవేమీ రుణభారం ఏమీ ఉండదు. అప్పు లేకుండా సేవింగ్స్, ప్లానింగ్స్‌పై దృష్టిపెట్టవచ్చు. ఇక పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టడమంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరమేమీ లేదు. చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అంటే ఆదాయంలో కొద్ది మొత్తాన్ని దాచిపెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఇబ్బందుల్లో ఉన్న ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది కష్టపడి సంపాదిస్తారు. కానీ ధనవంతులుగా మారలేరు. ఐశ్వర్యవంతులవ్వాలంటే చెమటొట్చడమే కాకుండా తెలివిగా వ్యవహరించాలి. డబ్బుకు సంబంధించిన కొన్ని అలవాట్లను కూడా నేర్చుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒక లుక్కేద్దాం.
సకాలంలో అప్పులు చెల్లించడం అత్యంత తెలివైన పని. అలా నడుచుకుంటే చెల్లించాల్సినవేమీ రుణభారం ఏమీ ఉండదు. అప్పు లేకుండా సేవింగ్స్, ప్లానింగ్స్‌పై దృష్టిపెట్టవచ్చు. ఇక పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టడమంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరమేమీ లేదు. చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అంటే ఆదాయంలో కొద్ది మొత్తాన్ని దాచిపెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఇబ్బందుల్లో ఉన్న ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఖర్చులకు సంబంధించి చక్కటి బడ్జెట్‌ని రూపొందించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ బడ్జెట్‌ని రూపొందించుకోవాలి. అప్పులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా వడ్డీలతో కూడిన అప్పులకు వీలైనంత దూరంగా ఉండాలి. అధిక వడ్డీ ఉండే లోన్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. సకాలంలో చెల్లింపులు చేస్తూ ఉండాలి. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు విషయంలో కూడా ప్రణాళికబద్ధంగా ఉండాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఖర్చులకు సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా అనవసర ఖర్చులు ఏంటనేవి కూడా తెలిసిపోతాయి. మరోవైపు అవసరమైన వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఉపయోగపడని వస్తువులపై కూడా ఖర్చు పెట్టకూడదు. రిటైర్మెంట్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం చాలా ఉపయోగకరం. ఇక మనీ సేవ్ చేయడమంటే డబ్బు సంపాదిస్తున్నట్టేననే విషయాన్ని మరచిపోకూడదు. ఆదాయాన్ని మంచి ఖర్చులు చేయకూడదు. లభ్యమవుతున్నాయి కదా అని అప్పులు కూడా చేయకూడదు. ఆదాయ వ్యయాల నిష్పత్తిని లెక్కించుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ అలవాట్లను నేర్చుకునేవారు డబ్బు సంపాదనలో ముందుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated Date - 2023-06-20T22:27:12+05:30 IST