Udaan: 1.7 బిలియన్ ఉత్పత్తులను రవాణా చేసిన ఉడాన్
ABN, First Publish Date - 2023-01-19T19:02:38+05:30
దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉడాన్ (Udaan) గతేడాది 1.7 బిలియన్లకుపైగా ఉత్పత్తులను 22 మిలియన్లకుపైగా ఆర్డర్లకు అందించింది.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉడాన్ (Udaan) గతేడాది 1.7 బిలియన్లకుపైగా ఉత్పత్తులను 22 మిలియన్లకుపైగా ఆర్డర్లకు అందించింది. ఈ మేరకు ఉడాన్ వెల్లడించింది. మొత్తంగా 1200 పట్టణాలు, నగరాల్లోని 12,500కుపైగా పిన్‌కోడ్‌లకు ఉత్పత్తులను చేరవేసినట్టు తెలిపింది. నిత్యావసరాల విభాగం కింద 9 లక్షల టన్నుల ఉత్పత్తులను డెలివరీ చేసినట్టు తెలిపింది.
2.5 మిలియన్ ఆర్డర్ల అవసరాలు తీరుస్తూ 131 మిలియన్ ఉత్పత్తులను ఎలక్ట్రానిక్స్, జనరల్ మర్చండైజ్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో రవాణా చేశామని పేర్కొంది. ఈ కాలంలో 586 మంది విక్రేతలు రూ. కోటి వ్యాపారం చేస్తే 174 మంది విక్రేతలు రూ. 2 కోట్ల విలువైన వ్యాపారం చేసినట్టు వివరించింది. 2022లో దాదాపు 25 శాతం మంది రిటైలర్లు డిజిటల్ మాధ్యమాలను చెల్లింపుల కోసం ఉపయోగించినట్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ఉడాన్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వైభవ్ గుప్తా మాట్లాడుతూ.. ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్స్, జనరల్ మర్చండైజ్, ఫార్మా తదితర రంగాలలో చక్కటి వృద్ధిని తాము చూసినట్టు చెప్పారు. పలు బ్రాండ్లతో తమ సంబంధాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ చేరిక, సామర్థ్యం, నెట్‌వర్క్‌తో ఈ-కామర్స్ ప్రయోజనాలను లక్షలాదిమంది రిటైలర్లు కిరాణా స్టోర్లకు దేశవ్యాప్తంగా అందిస్తున్నట్టు చెప్పారు.
Updated Date - 2023-01-19T19:02:40+05:30 IST