ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TikTok: ప్రభుత్వ స్మార్ట్‌ఫోన్లలో అక్కడ కూడా ‘టిక్‌టాక్‌’ నిషేధం!

ABN, First Publish Date - 2023-03-16T21:25:41+05:30

చైనాకు చెందిన షార్ట్ వీడియోస్ యాప్ ‘టిక్‌టాక్’(TikTok)పై మరో దేశం కొరడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్: చైనాకు చెందిన షార్ట్ వీడియోస్ యాప్ ‘టిక్‌టాక్’(TikTok)పై మరో దేశం కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఫోన్లలో ఆ యాప్‌ను నిషేధించాలని బ్రిటన్(Britain) నిర్ణయించింది. భద్రతా కారణాలతో ఇప్పటికే పలు దేశాలు ఈ యాప్‌ను నిషేధించాయి. బీజింగ్‌(Beijing)కు చెందిన బైట్‌డాన్స్(ByteDance) కంపెనీ యాజమాన్యంలోని ఈ యాప్ సేకరించే యూజర్ డేటా చైనా ప్రభుత్వం చేతుల్లోకి చేరుతోందన్న భయాలు ఉన్నాయి. దీంతో తమ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ప్రభుత్వ ఫోన్లలో నిషేధించాలా? వద్దా? అన్న విషయాన్ని బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సమీక్షిస్తోంది. అమెరికా, కెనడా, బెల్జియం, యూరోపియన్ కమిషన్ ఇప్పటికే ఈ యాప్‌ను నిషేధించాయి. టిక్‌టాక్ నిషేధంపై మరో ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘టిక్‌టాక్’లోని చైనా యజమానుల పెట్టుబడులను ఉపసంహరించుకుంటే సరేనని, లేదంటే నిషేధం తప్పదని బైడెన్ ప్రభుత్వం హెచ్చరించినట్టు రెండు రోజుల క్రితం టిక్‌టాక్ తెలిపింది. కాగా, బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్‌కు అమెరికాలో 100 మిలియన్ల కంటే ఎక్కుమంది యూజర్లు ఉన్నారు.

Updated Date - 2023-03-16T21:25:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising