ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vodafone Idea: కొత్త ప్లాన్‌ను ప్రకటించిన వొడాఫోన్ ఐడియా.. ఆ ప్లాన్ వివరాలు ఇవే...

ABN, First Publish Date - 2023-04-25T21:50:35+05:30

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్(prepaid plan) వినియోదారులను దృష్టిలో పెట్టుకొని రూ. 549తో కొత్త ప్లాన్‌ విడుదల చేసింది. ఈ ప్యాక్‌లో మరిన్ని ఆఫర్లను పొందుపరించింది. 180 రోజులపాటు సర్వీస్ కాలపరిమితి ఉంటుంది. 1జీబీ డేటా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

రూ. 549తో రీచార్జ్ చేసుకుంటే రూ. 549 బ్యాలెన్స్ వస్తుంది. లోకల్, ఎస్టీడీ ఫోన్ కాల్స్‌కు సెకండ్‌కు రూ. 2.5 పైస ఛార్జ్ పడుతుంది. ఎలాంటి ఎస్ఎంఎస్‌లు ఉండవు. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 6 నెలల పాటు పని చేస్తుంది. డేటాతో సంబంధం లేకుండా కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ బాగా ఉపయోగపడనుంది.

ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు అపరిమిత కాల్స్‌తోపాటు డేటాను అందిస్తున్నాయి. కంపెనీ ఇచ్చిన 1జీబీ డేటా అయిపోతే డేటా వోచర్లతో రీచార్జ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చని వొడాఫోన్ ఐడియా తెలిపింది.

Updated Date - 2023-04-25T21:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising