Vodafone Idea: ఏపీ, తెలంగాణలో గిగానెట్ స్పీడ్ రెట్టింపు
ABN, First Publish Date - 2023-01-29T21:03:56+05:30
దేశంలోని ప్రముఖ టెలికం సంస్థల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ టెలికం సంస్థల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా (VI) ఏపీ, తెలంగాణలోని చందాదారులకు శుభవార్త చెప్పింది. గిగానెట్(Giganet) స్పీడ్‌ను రెట్టింపు చేసింది. ఇందుకోసం అదనంగా 1800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను 11 వేల సైట్స్ వద్ద రెండు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా డౌన్‌లోడ్, అప్‌లోడ్, స్ట్రీమింగ్ వేగం పెరగనుంది.
గత ఏడాది కాలంలో ‘వి’ (Vodafone Idea)అదనంగా 660 నూతన సైట్లను జోడించడంతోపాటు 6,201 సైట్లలో అదనపు సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సామర్థ్యం పెంపు వల్ల చందాదారులకు కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ప్రత్యేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. సామర్థ్యం పెంపు ద్వారా ‘వి గిగానెట్’పై రెండు తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు రెండు రెట్ల వేగం లభిస్తుంది.
ఈ సందర్భంగా వొడాఫోన్ ఇండియా ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలోని తమ చందాదారులకు అత్యున్నత, ఆధునికీకరించిన నెట్‌వర్క్ అనుభవాలను రెండు రెట్ల వేగంతో ‘వి గిగానెట్’పై ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నట్టు చెప్పారు. అందుబాటులో ఉన్న ప్లాన్లను ఎంచుకోవడం ద్వారా తమ నెట్‌వర్క్‌పై మరింత మెరుగైన అనుభవాన్ని పొందొచ్చని పేర్కొన్నారు.
Updated Date - 2023-01-29T21:03:58+05:30 IST