ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు శుభవార్త!

ABN, First Publish Date - 2023-03-06T20:23:07+05:30

ఈ రెండు ప్లాన్లను గతేడాది మేలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్లీ వీటిని పునరుద్ధరించింది. రూ. 195 ప్లాన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) వినియోగదారులకు ఇది శుభవార్తే. రూ. 195, రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్లను పునరుద్ధరించింది. ఈ రెండు ప్లాన్లను గతేడాది మేలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్లీ వీటిని పునరుద్ధరించింది. రూ. 195 ప్లాన్‌లో ఇప్పుడు గతంలో కంటే అధిక డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే ప్లాన్లను కూడా కొంత అప్‌డేట్ చేసింది.

వొడాఫోన్ ఐడియా రూ. 195 ప్లాన్

వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) రూ. 195 ప్లాన్‌లో 3జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. కాలపరిమితి నెల రోజులు. అలాగే, అదనంగా వీఐ మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. గతంలో ఇదే ప్లాన్‌లో 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు లభించేవి. అపరిమిత కాలింగ్, 31 రోజుల కాలపరిమితి ఉండేది.

వొడాఫోన్ ఐడియా రూ. 319 ప్లాన్

వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) రూ. 319 ప్లాన్‌లో రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటాతోపాటు బింగె ఆల్‌నైట్, వీకెండ్ డేటా రోలోవర్, వీఐ మూవీస్, టీవీ క్లాసిక్, డేటా డిలైట్స్ వంటి హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు లభిస్తాయి. దీని కాలపరిమితి గతంలో 31 రోజులు ఉండగా, ఇప్పుడు 30 రోజులకు కుదించింది.

వొడాఫోన్ 296 ప్లాన్

వొడాఫోన్ కొత్తగా రూ. 296లో మరో ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో 30 రోజుల కాలపరిమితి ఉంటుంది. మొత్తంగా 25జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇతర టెలికం సంస్థలు కూడా ఇలాంటి ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి.

Updated Date - 2023-03-06T20:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising