ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yamaha125cc scooter: యమహా విడుదల చేసిన ఈ స్కూటర్ గురించి తెలిస్తే..

ABN, First Publish Date - 2023-02-20T21:27:42+05:30

యమహా మోటార్ ఇండియా ఆహ్లాదకరమైన, ఫీచర్‌ ప్యాక్డ్‌ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్‌ శ్రేణిని విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: యమహా మోటార్ ఇండియా ఆహ్లాదకరమైన, ఫీచర్‌ ప్యాక్డ్‌ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్‌ శ్రేణిని విడుదల చేసింది. వీటిలో ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌(Fascino S 125 Fi Hybrid (Disc)), రే జడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌(Ray ZR 125 Fi Hybrid (Disc)), రే జడ్‌ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌(Ray ZR Street Rally 125 Fi Hybrid (Disc)) ఉన్నాయి. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించాలనే భారతదేశపు లక్ష్యానికి అనుగుణంగా ఈ 2023 వెర్షన్‌ యయహా 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌లో ఈ 20 ఫ్యూయల్‌ ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ను ఉపయోగించింది. ఈ నూతన ఇంజిన్‌ ఓబీడీ2 ప్రమాణాలను సైతం కలిగి ఉంది.

125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణిలో యమహా విప్లవాత్మక బ్లూ టూత్‌ ఆధారిత వై- కనెక్ట్‌ యాప్‌ (ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌) ఉంది. ద్విచక్ర వాహనాలకు నూతన ప్రమాణాలను నిర్ధేశిస్తూ యమహా కనెక్ట్‌ యాప్‌ పలు సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీనిలో ఇంధన వినియోగట్రాకర్‌, నిర్వహణ సూచనలు, చివరి పార్కింగ్‌ లొకేషన్‌, మాల్‌ఫంక్షన్‌ నోటిఫికేషన్‌, రైడర్‌ ర్యాంకింగ్‌ సహా మరెన్నో ఉన్నాయి.

వీటితో పాటు 2023 శ్రేణి యమహా 125 హైబ్రిడ్‌ స్కూటర్లు అసాధారణ రంగులతో వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. స్కూటర్ లాంచింగ్ సందర్భంగా యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ.. కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌ ప్రచారం కింద తమ వినియోగదారులకు అసాధారణ అనుభవాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. భారతదేశంలో స్కూటర్‌ విభాగంలో పోటీ ఎక్కువగా ఉందని, దీంతో వినియోగదారుల అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. 2023 వెర్షన్‌ 125సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణితో అత్యున్నత అనుభవాలను అందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతీయ వినియోగదారుల అంచనాలను సరికొత్త ఫీచర్లు, రంగులతో అందుకోగలమని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ధరలు ఇలా..

* ఫాసినో ఎస్ 125 హైబ్రిడ్ (డిస్క్) స్కూటర్ డార్క్ మాటె బ్లూ రంగులో అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌ షోరూం ధర రూ. 91,030

* రే జడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (డిస్క్ స్కూటర్ డార్క్ మాటె బ్లూ రంగులో అందుబాటులో ఉంది. ఎక్స్‌షోరూం ధర రూ. 89,530

* రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (డిస్క్) స్కూటర్ లైట్ గ్రే వెర్మిలియన్, మాటె బ్లాక్ రంగుల్లో లభ్యమవుతోంది. ధర రూ. 93, 530

Updated Date - 2023-02-20T21:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising