Beauty parlour: పేరుకేమో బ్యూటీపార్లర్.. కానీ లోపల జరిగేది మాత్రం...
ABN, First Publish Date - 2023-07-06T11:43:36+05:30
స్థానిక అంబత్తూర్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్(Beauty parlour)లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతం
పెరంబూర్(చెన్నై): స్థానిక అంబత్తూర్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్(Beauty parlour)లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలోని పార్లర్‌లలో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆవడి పోలీస్ కమిషనరేట్ లోని వ్యభిచార నిరోధక విభాగం పోలీసులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో, అంబత్తూర్ పోలీస్‌స్టేషన్(Ambattur Police Station) సమీపంలోని శివానందనగర్ 2వ మెయిన్ రోడ్డులో పనిచేస్తున్న బ్యూటీపార్లర్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, అందులో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పార్లర్ యజమాని రాజేష్‌కన్నన్ (47), అక్కడ పనిచేస్తున్న 23 ఏళ్ల యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు, వ్యభిచారం లో పాల్గొంటున్న ముగ్గురు యువతులను విడిపించి ప్రభుత్వ హోంకు తరలించారు.
Updated Date - 2023-07-06T11:43:36+05:30 IST