ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bellary: 15 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఏమయ్యాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-06-03T12:27:36+05:30

మరో 15 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పిడుగుపాటుకు బలయ్యాడు. పొలం పనులకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో పిడుగుపాటుకు ఒకరు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి(బెంగళూరు): మరో 15 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పిడుగుపాటుకు బలయ్యాడు. పొలం పనులకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో పిడుగుపాటుకు ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బళ్లారిరూరల్‌ పరిధిలోని రాయాపురం గ్రామంలో గురువారం సాయంత్రం ఎర్రిస్వామి కుమారుడు రుద్రముని (25), రాముడు కుమారుడు తరుణ్‌ (20) పత్తి పంట కాపలా కోసం గురువారం సాయంత్రం పొలానికి వెళ్లారు. ఆకస్మికంగా వర్షం రావడంతో పొలంలో వున్న వేపచెట్టు కిందకు వెళ్లారు. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఎక్కువ కావడంతో ఎక్కడకు వెళ్లేందుకు వీలులేక చెట్టు కిందే నిలిచిపోయారు. ఇదే సమయంలో భయంకరమైన శబ్దంతో కూడిన పిడుగు పడడంతో రుద్రముని అక్కడికక్కడే మృతిచెందగా తరుణ్‌ తీవ్ర గాయాలతో గ్రామం చేరుకున్నాడు. గ్రామస్థులకు విషయం తెలపడంతో వెంటనే వ్యవసాయ పొలానికి వెళ్లి చూడగా అప్పటికే రుదమ్రుని మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు హగరి ఎస్‌ఐ సరళ, తహసీల్దార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, గాయపడిన తరుణ్‌ను విమ్స్‌ ఆస్పత్రిలో తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మిన్నంటిన రోదనలు

రుద్రముని మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ కుమారుడు రుద్రమునికి 15 రోజుల్లో వివాహం చేయాల్సి ఉందని, పెళ్లి సమయంలో అకాల వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చి తమ కుమారుడిని పరలోకానికి తీసుకెళ్లాయని తల్లిదండ్రులు బోరున విలపించారు. కుమారుడికి వివాహం చేసి సంతోషంగా చూడాలనుకున్నామని, ఇంతలోనే తమ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుందని, తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రుద్రముని(Rudra Muni) కుటుంబానికి శుక్రవారం మంత్రి నాగేంద్ర సోదరుడు వెంకటేష్‌ ప్రసాద్‌ ఆర్థిక సాయం అందించారు. రాయాపూర్‌ గ్రామానికి చెందిన రుద్రముని మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం తమ వంతుగా దహన సంస్కారాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

రాయచూరులో మరో యువకుడు...

రాయచూరు: జిల్లాలోని లింగసుగూరు తాలూకా బెందోణ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు నూర్‌ అహ్మద్‌ పిడుగు పడి మృతి చెందాడు. గురువారం రాత్రి ఇదురు గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించగా పొలంలో పని చేస్తున్న నూర్‌ అహ్మద్‌ పిడుగుపాటుగు గురై మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్నతహసీల్దార్‌ డీఎస్‌ జమేదార్‌, ఆర్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2023-06-03T12:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising