ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhadrachalam: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల విధ్వంసం

ABN, First Publish Date - 2023-12-06T12:00:20+05:30

మావోయిస్టు పార్టీ 23వ పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem)

- పలుచోట్ల రహదారులు ధ్వంసం

దుమ్ముగూడెం(భద్రాచలం): మావోయిస్టు పార్టీ 23వ పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem) మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. పొటకపల్లి-పాలోడి, పొటకపల్లి-దుబ్బమరక ప్రధాన రహదారులపై నాలుగు చోట్ల రోడ్డును తవ్వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా మంగళవారం దుమ్ముగూడెం మండల సరిహద్దు కిష్టారం వారాంతపు సంతకు వెళ్లే వ్యాపారులు ఎప్పటిలానే వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా రాత్రి 7.30కు భద్రాచలం-చర్ల సర్వీసును ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులను సైతం నిలిపివేశారు. వారోత్సవాలకు 8వ తేదీ చివరి రోజు కావడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌(Telangana-Chhattisgarh) సరిహద్దుల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Updated Date - 2023-12-06T12:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising