Chennai: ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా.. భార్యకు తెలియకుండా ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2023-03-05T10:50:30+05:30
స్థానిక తాంబరం సమీపం మణిమంగళం వద్ద కన్నబిడ్డను భార్యకు తెలియకుండా హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మణిమంగళం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక తాంబరం సమీపం మణిమంగళం వద్ద కన్నబిడ్డను భార్యకు తెలియకుండా హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మణిమంగళం కారనై పెరియానగర్(Periyanagar)కు చెందిన వరుణ్, విజయలక్షి ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియపరచకుండా వరుణ్ రహస్యంగా ఉంచారు. ఆరుమాసాలకు ముందు ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత వరుణ్ తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని తెలిపి వారి అంగీకారంతో విజయలక్ష్మిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే తమకు మగబిడ్డ ఉందనే విషయం తెలిస్తే తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తారని భయపడి ఆ బిడ్డను కొద్ది రోజులపాటు మహాలక్ష్మి అనే స్నేహితురాలికి అప్పగిస్తానని భార్యకు చెప్పాడు. ఈక్రమంలో వరుణ్ తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని చెప్పడంతో వారు విజయలక్ష్మితో పెళ్ళి చేశారు. ఆ తర్వాత విజయలక్ష్మి బిడ్డ గురించి అడిగినప్పుడు మహాలక్ష్మి వద్దే ఉన్నాడని చెబుతూ వచ్చాడు. వరుణ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అడిగింది. మూడు రోజులపాటు బిడ్డను తన వద్ద ఉంచాడని, ఆ తర్వాత తీసుకెళ్ళాడని చెప్పింది. దీనిపై విజయలక్ష్మి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని వరుణ్‌వద్ద విచారణ జరిపినప్పుడు బిడ్డను హత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో వరుణ్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Updated Date - 2023-03-05T10:50:30+05:30 IST