Chit Fund: చిట్‌ఫండ్ నడిపి రూ.4 కోట్ల మోసం.. దంపతుల అరెస్ట్
ABN, First Publish Date - 2023-03-30T11:25:15+05:30
చిట్‌ఫండ్ సంస్థ నడిపి రూ.4 కోట్ల మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి(Puducherry) రాష్ట్రం సోమంగళం
వేళచ్చేరి(చెన్నై): చిట్‌ఫండ్ సంస్థ నడిపి రూ.4 కోట్ల మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి(Puducherry) రాష్ట్రం సోమంగళం ప్రాంతానికి చెందిన వినాయగం-ఉమామహేశ్వరి దంపతులు స్థానిక తాంబరంలో నివాసం ఉంటున్నారు. వీరి స్నేహితురాలు విజయలక్ష్మి ద్వారా కడలూరు సెమ్మండలం పరాశక్తి నగర్‌కు చెందిన గోమతి-వేదగిరి దంపతులతో ఉమామహేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఇంటి పైఅంతస్తులో మూకాంబిగై చిట్స్‌ఫండ్స్ నడుపుతున్న గోమతి వద్ద ఉమామహేశ్వరి బ్యాంక్ ద్వారా రూ.35,44,350, నగదు రూపంలో రూ.56,52,450 అని మొత్తం రూ.91,90,800 అందజేసింది. కాలం ముగిసిన తర్వాత ఉమామహేశ్వరి(Umamaheswari) అడగంతో బ్యాంక్ చెక్ అందజేసిన గోమతి, చెక్ బ్యాంక్‌లో వేయొద్దని, మూడు నెలల తర్వాత నగదు అందిస్తామని తెలిపింది. అనంతరం గోమతి దంపతులు అదృశ్యమయ్యారు. ఈ వ్యవహారంపై కడలూరు జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఉత్తర్వులతో పోలీసులు చేపట్టిన విచారణలో, గోమతి సుమారు రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో, మంగళవారం వాలాజాబాద్‌లో ఉన్న గోమతి, భర్త వేదగిరిని అరెస్ట్ చేసి కడలూరు జైలులో హాజరుపరచి జైలుకు తరలించారు.
Updated Date - 2023-03-30T11:25:15+05:30 IST