ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Noida Delivery Agent: నోయిడాలో దారుణం.. మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం.. ఆపై తుపాకీతో హల్‌చల్

ABN, First Publish Date - 2023-10-29T20:43:47+05:30

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన చర్యలు చేపడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. రాబందుల్లా వారిపై ఎగబడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా...

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన చర్యలు చేపడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. రాబందుల్లా వారిపై ఎగబడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రాక్షసుడు కూడా అలాంటి ఘాతుకానికే పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి పారిపోయి, పోలీసులకు లొంగిపోయినట్టు నాటకమాడాడు. చివరికి ఒక అధికారి నుంచి తుపాకీ దొంగలించి, కాసేపు హల్‌చల్ సృష్టించాడు. గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..


గ్రేటర్‌ నోయిడాలో ఉన్న హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ నివాసం ఉంటోంది. ఇంట్లో నిత్యవసర సరుకులు అయిపోవడంతో.. ఒక యాప్‌లో వాటిని ఆర్డర్ పెట్టారు. ఆ సరుకులను తీసుకొని 23 ఏళ్ల సుమిత్‌ సింగ్ అనే డెలివరీ బాయ్‌ ఆమె ఇంటికి చేరుకున్నాడు. మొదట్లో ఆమెతో మంచిగానే ప్రవర్తించాడు. కానీ.. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని, ఓ పన్నాగం పన్నాడు. తనకు నీళ్లు కావాలని అడిగాడు. నీళ్లు తీసుకురావడం కోసం ఆమె లోపలికి వెళ్లగా.. అతడు బలవంతంగా లోపలికి చొరబడి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడ్ని నివారించేందుకు ఆ మహిళ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం ఆ కామాంధుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు తెలియజేసింది.

ఆ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. సుమిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతడు ఉన్న చోటును గుర్తించి, అక్కడికి వెళ్లారు. తాను లొంగిపోయినట్లు అతడు నాటకమాడి, ఓ కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కొని పరారయ్యాడు. పోలీసులు అతడ్ని వెంబడించగా.. అతడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో.. అతని కాలికి బుల్లెట్ దిగింది. దాంతో సుమిత్ అక్కడే పడిపోగా.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపినట్లు అతనిపై కేసులున్నాయి.

Updated Date - 2023-10-29T20:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising