ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Current Shock: సూపర్ మార్కెట్లకు పిల్లలను తీసుకెళ్తున్నారా? అయితే ఫ్రిజ్‌లతో జాగ్రత్త.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-10-02T17:49:19+05:30

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఓ సూపర్ మార్కెట్‌లో నాలుగేళ్ల చిన్నారి రుషిత కరెంట్ షాక్‌తో మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని.. చాలామంది పెద్దలు వాళ్లను సూపర్ మార్కెట్లకు, షాపింగ్ మాళ్లకు తమతో పాటు తీసుకువెళ్తుంటారు. అయితే సూపర్ మార్కెట్లకు వెళ్లిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో అన్న విషయాన్ని పెద్దలు గమనించరు. వాళ్ల పనిలో వాళ్లు నిమగ్నమవుతారు. పిల్లలు మాత్రం వాళ్లకు తినే వస్తువులు కనిపిస్తే మాత్రం వాటిని వదిలిపెట్టరు. ఫ్రిజ్‌లు ఓపెన్ చేసి చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ చిన్నారి సూపర్ మార్కెట్‌లో చాక్లెట్ కోసం ఫ్రిజ్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది.

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ రాజశేఖర్ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కూతురు ఏం చేస్తుందో పట్టించుకోలేదు. అయితే చిన్నారి రుషిత మాత్రం చాక్లెట్ కోసం ఫ్రిజ్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఫ్రిజ్ డోర్ తీయగా .. ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని చాలాసేపటి వరకు తండ్రి రాజశేఖర్ గమనించలేదు. కొన్ని క్షణాల తర్వాత ఫ్రిజ్ వైపు వెళ్తుండగా తన కూతురు విగత జీవిగా కనిపించడంతో షాక్ అయ్యాడు. వెంటనే చిన్నారిని చేతిలోకి తీసుకుని పరుగుపెట్టాడు. వెంటనే ఆ చిన్నారిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు పరీక్షించి ఆ చిన్నారి మృతి చెందినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. నాలుగేళ్ల చిన్నారి రిషిత కరెంట్ షాక్ వల్ల మృతి చెందినట్లు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు దృవీకరించారు.

ఇది కూడా చదవండి: Crime: ఇంట్లో శవమై కనిపించిన 8 నెలల గర్భిణి.. అసలు ఏం జరిగిందంటే..?

కాగా ఎన్ సూపర్ మార్కెట్ యాజమాన్యంపై రుషిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుల అలసత్వం వల్లే తమ చిన్నారి పాప బలైందని మండిపడుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నందిపేట్ మండల కేంద్రంలో కనీస సౌకర్యాలు ప్రజల రక్షణకు చర్యలు తీసుకోకుండా ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాళ్లకు వెళ్లే సమయంలో చిన్నారులను కనిపెట్టుకుని ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-10-02T17:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising