ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: 16 ఏళ్ల బాలిక అతి తెలివి మామూలుగా లేదుగా.. ఒక్క మెసేజ్‌తో కోటి రూపాయలు సంపాదించాలనుకుంది.. కానీ..!

ABN, First Publish Date - 2023-05-22T15:27:48+05:30

పిల్లలు వయసులోనూ.. చదువులోనూ రాణించాలనీ ప్రతీ తల్లిదండ్రులూ కోరుకుంటారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లు గొప్పవారైతే చూసి ఆనందించేది మొట్టమొదట పేరెంట్సే. అలా కాకుండా

Crime News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు వయసులోనూ.. చదువులోనూ రాణించాలనీ ప్రతీ తల్లిదండ్రులూ కోరుకుంటారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లు గొప్పవారైతే చూసి ఆనందించేది మొట్టమొదట పేరెంట్సే. అలా కాకుండా దారి తప్పి నడుచుకుంటే మాత్రం కన్నవాళ్ల కష్టం వృధా అయిపోతుంది.

తెలిసీతెలియని వయసులో కొంత మంది పిల్లలు తీసుకునే నిర్ణయాలు పెద్దల్నీ ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. సహజంగా పిల్లలు స్కూల్‌కో.. కాలేజీకో వెళ్లినప్పుడు తప్ప.. మిగతా సమయాల్లో బయటకు వెళితే కంగారు పడుతుంటారు. పైగా పరీక్షలు అయిపోయాయి. వేసవి సెలవులు కావడంతో పిల్లలంతా ఇంటి దగ్గరే ఉంటున్నారు. అప్పటిదాకా కళ్ల ముందే తిరిగిన పిల్లలు ఒక్కసారిగా కనిపించకపోయే సరికి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారిని వాకబు చేశారు. సమీప ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలోనే ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మ్యాటర్ చదివి గుండె ఆగినంత పనైంది. అసలు ఇంతకీ ఏమైంది? పిల్లలు ఎక్కడికెళ్లారు. మెసేజ్ సారాంశం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

మొదటి సారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు విద్యార్థుల్లో గానీ.. తల్లిదండ్రుల్లో గానీ ఒక విధమైన టెన్షన్ ఉంటుంది. తమ బిడ్డ పాస్ అవుతుందా? లేదా?. ఒకవేళ పాస్ అయితే ఓ క్లాస్ వస్తుందని రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే రాసిన విద్యార్థుల్లో కూడా ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఇక రిజల్ట్స్ వచ్చాక సరైన ఫలితం రాకపోతే పిల్లలు ఆందోళన చెందుతారు. కొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని కన్నపేగుకు దుఖం కలిగిస్తుంటారు. అందుకే ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ధైర్యం నూరుపోయాలి.

కరెక్ట్‌గా టెన్త్ ఫలితాలు రానే వచ్చాయి. రిజల్ట్స్ చూసేందుకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్తున్నామని తన ఆరేళ్ల చెల్లితో కలిసి పదహారేళ్ల బాలిక (girl pretends) బయటకు వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి బాలికకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. దీంతో పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణం చేపట్టారు. ఇంతలో బాలిక తండ్రికి గుర్తుతెలియని నెంబర్ నుంచీ ఓ మెసేజ్ వచ్చింది. కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్ (kidnapped) చేశామని.. రూ.కోటి (1 crore) ఇస్తేనే విడిచి పెడతామని బెదిరింపు మెసేజ్ (sends text) వచ్చింది. దీంతో తల్లిదండ్రులు మరింత కంగారు పడ్డారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

చివరకు నదియా జిల్లాల్లోని ఓ నర్సింగ్ హోం ఎదుట ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లల్ని అదుపులోకి తీసుకుని విచారించగా వారి చెప్పిన సమాచారం విని షాక్‌కు గురయ్యారు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు తిడతారని ఇంట్లో నుంచీ వెళ్లిపోయినట్లు తెలిపారు. తాము కిడ్నాప్ కాలేదని కావాలనే డ్రామా ఆడినట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది.

Updated Date - 2023-05-22T15:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising