ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: పెళ్లి వేడుకలో రభస.. పెళ్లి బృందంపై హోటల్ సిబ్బంది దాడి.. ఇంత దారుణమా అంటూ నెటిజన్లు షాక్!

ABN, First Publish Date - 2023-02-28T16:05:08+05:30

అప్పటివరకు అత్యంత సంతోషంగా, ఉల్లాసంగా ఉన్న పెళ్లి వేదిక (Wedding) ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులు చావు దెబ్బలు తిని పరుగులు తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అప్పటివరకు అత్యంత సంతోషంగా, ఉల్లాసంగా ఉన్న పెళ్లి వేదిక (Wedding) ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులు చావు దెబ్బలు తిని పరుగులు తీశారు. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు (Ghaziabad) చెందిన ఓ కుటుంబం గ్రాండ్ ఐరిస్ హోటల్‌లో (Hotel) పెళ్లి వేడుకను ఏర్పాటు చేసింది. శనివారం సాయంత్రం అక్కడ మెహిందీ వేడుక నిర్వహించారు.

డీజే ఏర్పాటు చేసుకుని పెళ్లి బృందం డ్యాన్సులు వేసింది. అర్ధరాత్రి దాటాక 2 గంటలకు హోటల్ సిబ్బంది డీజేను ఆపేశారు. మరికొద్ది సేపు డీజేను (DJ) కొనసాగించాల్సిందిగా పెళ్లి వారు విజ్ఞప్తి చేశారు. అందుకు హోటల్ సిబ్బంది అంగీకరించలేదు. దీంతో పెళ్లి బృందం, హోటల్ సిబ్బంది మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ వాగ్వాదం క్రమంగా తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో హోటల్ సిబ్బంది పెళ్లి బృందంపై బౌన్సర్లను ప్రయోగించారు (Hotel staff beat up guests at wedding).

Shocking Video: రైలులో అమ్మాయిల షాకింగ్ ప్రవర్తన.. గంజాయి, సిగరెట్లు తాగుతూ రచ్చ.. చివరకు..

హోటల్ సిబ్బంది, బౌన్సర్లు కలిసి వరుడితోపాటు, అతడి బంధువులపై కూడా దాడి చేశారు. దొరికిన వారిని చితక్కొట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. హోటల్ యాజమాన్యంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు (Crime News). పరారీలో ఉన్న మరి కొందరి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోటల్ సిబ్బందిపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-02-28T16:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!