ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: వ్యసనాలకు అలవాటు పడి 102 వరుస దొంగతనాలు.. సెంచరీ దొంగ అరెస్టు

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:26 AM

వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు ప్రారంభించిన వ్యక్తి అనతి కాలంలోనే సెంచరీకి పైగా చోరీలకు పాల్పడ్డారు. పీడీ యాక్టు పెట్టి ఏడాదిపాటు జైళ్లో ఉంచినా ఆ వ్యక్తి తీరు మారలేదు.

- కొట్టేసిన సొత్తు చీటీపై రాసి చోరీ ప్రదేశంలో..

తార్నాక(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు ప్రారంభించిన వ్యక్తి అనతి కాలంలోనే సెంచరీకి పైగా చోరీలకు పాల్పడ్డారు. పీడీ యాక్టు పెట్టి ఏడాదిపాటు జైళ్లో ఉంచినా ఆ వ్యక్తి తీరు మారలేదు. మళ్లీ చోరీకి పాల్పడడంతో ఆ దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు(Osmania University Police) అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్‌ ఏసీపీ సైదయ్య వివరాలు వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌(Nagar Kurnool) జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్‌ శంకర్‌ నాయక్‌ (28) గద్వాలలో బీఫార్మసీ చదువుతుండగా ఓ హత్యాయత్నం కేసులో 2012లో జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం మద్యం సిగరేట్లు, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు తన సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజేశ్‌ రెడ్డి, రంగారావు, లియాజాఖాన్‌ తదితర పేర్లతో చలామణి అవుతూ, వివిధ ప్రాంతాల్లో, కాలనీల్లో పగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవాడు. 2022 సెప్టెంబర్‌లో మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కడంతో అతనిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. అప్పటీకే అతడు చేసిన చోరీల సంఖ్య 94, మూడు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన శంకర్‌ నాయక్‌ తన వైఖరిని మార్చుకోక ఎనిమిది దొంగతనాలకు పాల్పడ్డాడు. వాటిలో మూడు ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాగా, ఉప్పల్‌, కుషాయిగూడ, జడ్చర్ల టౌన్‌, సంగారెడ్డి రూరల్‌, నాగర్‌ కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఉండటం గమనార్హం. ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హబ్సిగూడా స్ట్రీట్‌ నెంబర్‌ 5లో నివాసముంటున్న లగిశెట్టి రాజు తన కుటుంబంతో సహా గత సెప్టెంబర్‌ 17న స్వగ్రామానికి వెళ్లి, 20న ఇంటికి తిరిగి వచ్చాడు.

ఆ సమయానికి ఇంటి తాళం తీసి ఉండటంతోపాటు ఇంట్లోని సామాన్లు అన్నీ చిందరవందరగా పడిఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని 19 తులాల బంగారు ఆభరణాలు, కొన్ని యూఎస్‌ డాలర్లు, కొంత నగదు చోరికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి విచారణ చేస్తున్న క్రమంలో, నిందితుడు మంగళవారం సాయంత్రం అమీర్‌పేట్‌లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు తాను చేసిన నేరాలను ఒప్పుకొన్నాడు. దీంతో అతని నుంచి ఇరవై తులాల బంగారు ఆభరణాలతో పాటు, బైకు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అవాక్కయిన పోలీసులు

శంకర్‌నాయక్‌ చోరీ విధానం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. చోరీ చేసిన ప్రదేశంలో దొంగతనం చేసిన వస్తువుల వివరాలను ఒక చీటిలో రాసి అక్కడే వదిలేసేవాడు. చీటి దొరకని పక్షంలో గోడపై వివరాలను రాసేవాడు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏయే వస్తువులను చోరీ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకోవడం గమనార్హం. గతంలో ఒక చోరీ చేసిన సమయంలో అక్కడ ఏమీ దొరక్కపోయినా, 5 తులాల బంగారు ఆభరణాలు పోయాయని ఇంటి యాజమాని ఫిర్యాదు చేశారని, అప్పటి నుంచి ఈ అలవాటు చేసుకున్నానని శంకర్‌ నాయక్‌ చెప్పడం విశేషం.

Updated Date - Dec 28 , 2023 | 10:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising