Hyderabad: ‘బిగ్‌బాస్’ ఘటనలో ఇద్దరి అరెస్ట్
ABN, Publish Date - Dec 20 , 2023 | 11:48 AM
బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్స్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) వద్ద జరిగిన గొడవకు కారణమైన ఇద్దరు కారు డైవర్లను జూబ్లీహిల్స్
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్స్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) వద్ద జరిగిన గొడవకు కారణమైన ఇద్దరు కారు డైవర్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్(Big Boss) ఫైనల్ విజేత పల్లవి ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చిన రెండు కార్ల డ్రైవర్లు పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా ప్రశాంత్‌ను ఎక్కించుకొని అన్నపూర్ణ స్డూడియో వద్దకు తీసుకువచ్చారు. ఇందుకు కారు డ్రైవర్లు నిజామాబాద్‌కు చెందిన షతాని సాయికిరణ్, నాగర్‌కర్నూల్(Nagarkurnool)కు చెందిన రాజులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో రాళ్ల దాడులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Updated Date - Dec 20 , 2023 | 11:48 AM