ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:03 AM

ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కాచిగూడ(Kachiguda) రైల్వే పీఎస్‌ పరిధిలో

బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కాచిగూడ(Kachiguda) రైల్వే పీఎస్‌ పరిధిలో శుక్రవారం ఆర్ధరాత్రి జరిగింది. సీఐ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మాదన్నపేట మోహిన్‌బాగ్‌కు చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(42) కూలీ. భవానీనగర్‌ తలాబ్‌కట్టకు చెందిన కిరాణ దుకాణం నిర్వాహకుడు షేక్‌ ఆరీఫ్‌(26) స్నేహితులు. శుక్రవారం రాత్రి యాకుత్‌పుర - ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల నడుమ మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతుండగా, రైలు ఽఢీకొట్టింది. ఇద్దరికి తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులకు మద్యం, గంజాయి అలవాటు ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఇద్దరు గొడవపడి పట్టాలపైకి వెళ్లడం వల్లనే రైలు ఢీకొట్టినట్లు చెబుతున్నారు. భవానీనగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

స్నేహితుని మృతిని తట్టుకోలేక..

ప్రాణ స్నేహితుడు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌ దర్వాజా మహంకాళి ఆలయం సమీపంలో నివాసముంటున్న గుర్రం రాములు కుమారుడు నరేష్‌ (32) చెప్పుల దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి నరేష్‌ స్నేహితుడు. ఈ నెల 28న నరేష్‌ మృతి చెందడంతో.. అప్పట్నుంచి బాధలో ఉన్న గుర్రం నరేష్‌ శనివారం రాత్రి ఉప్పుగూడ-యాకుత్‌పుర రైల్వేస్టేషన్‌ నడుమ చెన్నై-ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising