మెత్తని పరుపుపై భర్త.. కటిక నేలపై భార్య.. పెళ్లయిన మరుసటి రోజు నుంచి ఇదే తీరు.. పుట్టింటి వాళ్లు మంచం పంపించలేదన్న కోపంతో..
ABN, First Publish Date - 2023-02-22T18:02:35+05:30
చట్ట ప్రకారం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం. అయినా ఈ దురాచారం ఆగడం లేదు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా పెళ్లి సమయంలో కట్నం ఇచ్చుకోవాల్సిందే. కట్నంగా తమకు మంచం (Bed) ఇవ్వలేదనే కారణంతో..
చట్ట ప్రకారం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం. అయినా ఈ దురాచారం ఆగడం లేదు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా పెళ్లి సమయంలో కట్నం ఇచ్చుకోవాల్సిందే. కట్నంగా తమకు మంచం (Bed) ఇవ్వలేదనే కారణంతో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. పెళ్లైన మర్నాటి నుంచి భార్యను కటిక నేలపై పడుక్కోబెట్టాడు. చివరకు ఆమెను హత్య చేసి పరారయ్యడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు (Crime News).
బీహార్‌లోని (Bihar) సమస్తిపూర్‌కు సమీపంలోని శ్రీపుర్‌గహర్ గ్రామానికి చెందిన సులేఖకుమారి (22)కి గతేడాది పప్పుకుమార్‌తో వివాహమైంది. గతేడాది ఫిబ్రవరిలో సులేఖ తల్లిదండ్రులు కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. అయితే ఆ సమయంలో ఆమెకు మంచం ఇవ్వలేదు. పుట్టింటి నుంచి మంచం రాలేదనే కోపంతో పప్పు కుమార్ ఆమెను నేలపై పడుకోబెట్టి తాను మాత్రమే మంచంపై నిద్రపోయేవాడు. కట్నంగా రావాల్సిన మంచం, ఇతర వస్తువుల కోసం ఆమెను చాలా రకాలుగా చిత్రహింసలకు గురిచేశాడు (Dowry Harassment). చివరకు మంగళవారం రాత్రి సులేఖ చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
కాలేజీలో దిగాలుగా కూర్చున్న 17 ఏళ్ల బాలిక.. ఏమైందని అడిగితే ఏడుస్తూ ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన టీచర్.. వెంటనే..!
వెంటనే వారు వెళ్లి చూడగా ఇంట్లో సులేఖ విగత జీవిగా పడి ఉంది (Husband killed Wife). సులేఖ భర్త, అత్తమామలు గ్రామం విడిచి పారిపోయారు. సులేఖను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. సులేఖ సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సులేఖ మృతదేమాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2023-02-22T19:44:26+05:30 IST