భర్త గదిలో కరెన్సీ నోట్ల కట్టలు.. ఆశగా వెళ్లి వాటిని చూడగానే ఆ భార్యకు డౌట్.. దొంగ నోట్లేనని ఆమె గుర్తించడంతో..
ABN, First Publish Date - 2023-03-08T15:54:15+05:30
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ``ఫర్జీ`` అనే వెబ్ సిరీస్ చూసి ఇంట్లోనే నకిలీ నోట్లను ముద్రించడం మొదలు పెట్టాడు. భార్యకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే..
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బిలాస్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ``ఫర్జీ`` అనే వెబ్ సిరీస్ చూసి ఇంట్లోనే నకిలీ నోట్లను (Fake Currency Notes) ముద్రించడం మొదలు పెట్టాడు. భార్యకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం భర్త గదిలో గుట్టలు గుట్టలుగా ఉన్న కరెన్సీ నోట్లను చూసేసింది.. భర్తను నిలదీసి ఆ నకిలీ కరెన్సీ నోట్లను చింపేసింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తన మోసం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో భార్యను దారుణంగా హతమార్చాడు (Husband killed Wife). చివరకు విచిత్ర పరిస్థితుల్లో పోలీసులకు దొరికిపోయాడు (Crime news).
బిలాస్‌పూర్‌లోని (Bilaspur) ఉస్లాపూర్‌కు చెందిన పవన్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి తన 28 ఏళ్ల భార్య సతీ సాహును హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని ఓ పాలిథిన్ కవర్‌లో చుట్టి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు. అయితే చాలా రోజుల వరకు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. పవన్ నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్టు ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై దాడి చేశారు. పవన్ ఇంటి నుంచి నకిలీ నోట్లు ముద్రించే యంత్రం, రసాయన రంగు, 200, 500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ మీద నుంచి ఏదో దుర్వాసన వస్తున్నట్టు గ్రహించి పైకి వెళ్లి వాటర్ ట్యాంక్ తెరిచి చూసి షాకయ్యారు.
అంబులెన్స్‌లో పూలతో అలంకరించిన శవపేటిక.. డ్రైవర్ కంగారును చూసి పోలీసులకు డౌట్.. ఓపెన్ చేస్తే కనిపించిన సీన్ చూసి అంతా షాక్..!
వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం, కాళ్లు, చేతులు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. నిందితుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. తన నకిలీ నోట్ల వ్యవహారంలో జోక్యం చేసుకున్నందుకు జనవరి 5వ తేదీన భార్యను గొంతు కోసం చంపేశానని పవన్ నిజం అంగీకరించాడు. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Updated Date - 2023-03-08T15:54:15+05:30 IST