ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maruti: ప్రముఖ చిత్రకారుడు మారుతి కన్నుమూత

ABN, First Publish Date - 2023-07-28T09:24:44+05:30

ప్రముఖ చిత్రకారుడు మారుతి(Maruti) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా హృద్రోగంతో

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ చిత్రకారుడు మారుతి(Maruti) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న మారుతి పుణేలోని కుమార్తె దగ్గర ఉంటూ చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూసారు. పుదుకోటలో 1938లో జన్మించిన మారుతి అసలు పేరు రంగనాధన్‌. తమిళ వార, దిన పత్రికల్లో మారుతి మలచిన చిత్రాలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆనందవికటన్‌, కుంగుమం, కన్మణి వంటి ప్రముఖ వారపత్రికల్లో నవలలు, కథానికల కోసం ఆయన చేతుల్లో ప్రాణం పోసుకున్న బొమ్మలు పాఠకుల మనస్సులను హత్తుకునేవి. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. ఆయనకు భార్య విమల, కుమార్తెలు సుభాషిణి, సుహాసిని ఉన్నారు. తమిళ చలనచిత్రాలు ‘ఉలియిన్‌ ఓసై’, ‘పెన్‌సింగమ్‌’ వంటి పలు చిత్రాలకు ఆయన కళాదర్శకుడిగానూ పనిచేశారు.

Updated Date - 2023-07-28T09:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising